తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రేపటి (జూన్ 2న) నుంచి ఈ నెల 22 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Also Read : YV Subbareddy: జూన్ నెలాఖరుకి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు పూర్తవుతాయి
సచివాలయంలో ఇవాళ ( గురువారం ) దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమాలు, లబ్ధిదారులకు జరిగిన మేలుపై పాంప్లెట్స్ ద్వారా వివరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Also Read : Pakistan: చంద్రుడిని చూసినమని అబద్ధం చెప్తే పాకిస్తాన్ లో 10 లక్షల జరిమానా
రాష్ట్రంలో గొర్రెలపై సబ్సిడీ, వాహనాలపై సబ్సిడీ, ఉచిత చేప పిల్లల లబ్ధిదారులు చాలామంది ఉన్నారు.. వారిని పశుసంవర్ధక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 3న తెలంగాణ రైతు దినోత్సవం సందర్భంగా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో పాడి రైతులు, మత్స్యకారులు పాల్గొనే విధంగా చూడాలన్నారు. 8న చెరువుల పండుగ సందర్భంగా చెరువులు, రిజర్వాయర్ల వద్ద వేదికలను ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి తలసాని అధికారులకు తెలిపారు.