NTV Telugu Site icon

Minister Sridhar Babu: ఆరు గ్యారంటీలపై‌ అనుమానాలు వద్దు.. ఆరు నూరైనా అమలు చేస్తాం.

Minister Sridhar Babu

Minister Sridhar Babu

Minister Sridhar Babu: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం మంథనికి వచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ నేపథ్యంలో.. మంత్రికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలపై‌ అనుమానాలు వద్దు, ఆరు గ్యారంటీలని ఆరు నూరైనా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రూపాయి లేకున్నా.. ఎక్కడికైనా పోయి‌ తిరిగి రావచ్చు ఇది కదా మహిళ సాధికారత అని ఆయన అన్నారు.

Read Also: Bihar: చీటింగ్‌లకు పాల్పడకుండా ఎస్సై పరీక్షలో AI వినియోగం..

లక్ష్యానికి దూరంగా పనిచేసిన బీఆర్ఎస్ కి ప్రజలు గుణపాఠం చెప్పారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ చేపడుతామని తెలిపారు. ఇదిలా ఉంటే.. బీజేపీ పార్టీ రాజకీయ అంశాన్ని ముందు పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీకి మాటలు తప్ప చేతలు ఉండవని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు రెండు ఒకటే, ఆ రెండు పార్టీల నేతలు మాట మీద నిలబడరని మంత్రి ఆరోపించారు.

Read Also: CP Srinivas Reddy: సిటీ పోలీస్తో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కీలక భేటీ..