NTV Telugu Site icon

TS Cabinet: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే..

Ts Cabinet 1

Ts Cabinet 1

తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం అనంతరం.. నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు, మంత్రులు సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. వేద పండితులు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం తెలంగాణ కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 11 మంది మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అయితే కేబినెట్ మీటింగ్ కు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు వివరాలను వెల్లడించారు.

Read Also: Earthquake: వనాటులో 7.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. 6 గ్యారంటీలపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. వాటి అమలు ప్రక్రియలో భాగంగా అన్ని అంశాలపై చర్చించామని చెప్పారు. రేపు 2 గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చిస్తారని.. ముందుగా సోనియా గాంధీ పుట్టినరోజైన ఎల్లుండి 2 గ్యారంటీల అమలు ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు రవాణా సౌకర్యం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వరకు పెంపు నిర్ణయాలను సోనియాగాంధీ పుట్టిన రోజు నుంచి అమల్లోకి తీసుకువస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. మార్పు కావాలి, మార్పు కోరుకునే వారికి రాబోయే ఐదేళ్లలో మార్పు చూపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఖర్చుల గురించి శ్వేత పత్రం రిలీజ్ చేస్తామని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై వివరాలతో కూడిన అన్నీ అంశాలు తెలపాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆరు గ్యారెంటీల గురించి ప్రజలకు ముందే తెలిపాం.. అమలు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

Read Also: Ram Charan: బ్రేకింగ్.. నెట్ ఫ్లిక్ సీఈఓ తో మెగా ఫ్యామిలీ భేటీ..

రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తామని.. ఇందుకోసం అధికారులను ఆదేశించామన్నారు. ప్రణాళికలు లేకుండా విద్యుత్ కొనుగోలు జరిగిందని.. రేపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నతాధికారులతో రివ్యూ ఉంటుందని తెలిపారు. విద్యుత్ అంతరాయం జరుగకుండా వ్యవసాయంకు ఉచిత విద్యుత్, గృహ అవసరాలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తామని చెప్పారు. ఈ నెల 9న తెలంగాణ అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్లు శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక కూడా అదే రోజున వుంటుందని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా.. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటాము.. మంత్రులు, అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారని మంత్రి తెలిపారు. ఈ భేటీలో రైతుబంధు పై చర్చించామని.. ఆర్థిక శాఖ అధికారులు పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత రైతు బంధు పై ముందుకు వెళతామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి?.. హామీల అమలుపై ఎలా ముందుకు వెళ్ళాలి అనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

 

Show comments