సోమవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ఇతర ఉన్నతాధికారులతో విద్యా సంస్కరణలపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ స్కూళ్లు ఎందు వల్లనో ఇప్పుడా పరిస్థితిలో లేవని మంత్రి పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడలేక పోతున్నామని దీనికి దారితీసిన కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని అధికారులకు తెలిపారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగు పరచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
Read Also: CM Chandrababu and Deputy CM Pawan Kalyan: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కీలక చర్చలు..
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ చదువులను అందించాలనేది సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందుకు అనువైన పరిస్థితులను విద్యాశాఖ కల్పించాలి.. గుజరాత్ నుంచి ఏటా 30- 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సింగపూర్‌కు వెళ్లి ఉన్నత శిక్షణ పొంది వస్తున్నారు.. ఆ తరహా ప్రయత్నం మన వద్ద కూడా జరగాలని అధికారులకు మంత్రి సూచించారు. ఫిన్లాండ్, ఫ్రాన్స్, యుకెలలోని విద్యా ప్రమాణాలపై అధ్యయనం చేసి మన వద్ద కూడా ఆ స్థాయి విద్యను ప్రవేశ పెట్టాలన్నారు. పాఠ్యాంశాలను మార్చాలి.. సింగపూర్ ప్రభుత్వం మన దగ్గర ప్రపంచస్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది.. త్వరలోనే సింగపూర్ బృందం పర్యటిస్తుందని మంత్రి తెలిపారు. మన ఉపాధ్యాయులను కూడా ఇతర దేశాలకు పంపించి నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. దానికి సంబంధించిన విధివిధానానలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
Read Also: Rashmika: కర్ణాటక ఎక్కడుందో తెలియదా? రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాలి!