Site icon NTV Telugu

Ramantapur Incident Ex-Gratia: మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన!

Ramantapur Incident Ex Gratia

Ramantapur Incident Ex Gratia

Ramantapur Incident Ex-Gratia: హైదరాబాద్‌ రామంతపూర్ గోఖలే నగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల కారణంగా జరిగిన ఘోర విషాద ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీకృష్ణుడి విగ్రహ శోభాయాత్రలో రథానికి విద్యుత్ తీగలు తాకడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలవిస్తున్నారు. మరోవైపు పరిస్థితి విషమంగా ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద తమవారి కోసం ఎదురుచూస్తున్నారు.

Coolie 4 days box office collections : కూలీ 4 డేస్ కలెక్షన్స్.. ఇంకా చాలా రావాలి

ఇకపోతే, తెలంగాణ ప్రభుత్వం చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు మృతుల కుటుంబాలను కలిసి వారికి భరోసా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం అని అయన అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో 100 మీటర్ల దూరంలో శోభయాత్ర ముగుస్తుండగా ఘటన జరగడం దురదృష్టకరం అని ఆవేదన తెలిపారు.

R Madhavan: అంకుల్‌ అని పిలిస్తే అంగీకరించాల్సిందే !

ఈ ఘటనలో కేబుల్ వైర్ ద్వారా కరెంట్ సరఫరా జరిగి ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారని తెలిపారు. ఈ విషయమై హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశామని ఆయన అన్నారు. ఇక రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు చేపడతామని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేబుల్ వైర్లు కరెంటు తీగలపై స్పెషల్ డ్రైవ్ కు ఆదేశాలు జారీ చేశామని ఆయన అన్నారు.

Exit mobile version