Site icon NTV Telugu

Minister Sridhar Babu: గాడి తప్పిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం..

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Minister Sridhar Babu: కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో భూమి కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి అయిందన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. మెగా టెక్స్‌టైల్ పార్క్ ఆవరణలో పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచుతామన్నారు. తెలంగాణలో 80శాతం 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. ఈ విషయాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటోందన్నారు.

Read Also: Minister Konda Surekha: రాజన్న కోడెల వివాదంపై స్పందించిన మంత్రి సురేఖ

గాడి తప్పిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కాస్మొటిక్ ఛార్జీలను పెంచామన్నారు. ప్రతిపక్షాలు కావాలని రాజకీయ లబ్ధి కోసం విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వరికి క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తున్నామన్నారు. టెక్స్‌టైల్ పార్క్‌లో స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వరంగల్ జిల్లాలో ఉపాధి అవకాశాలను పెంచుతామని చెప్పారు.బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదన్నారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గంలో 3,500 ఇళ్లు కేటాయిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

Exit mobile version