Site icon NTV Telugu

Minister Sridhar Babu: పోలీసు ఉన్నతాధికారులతో మంత్రి శ్రీధర్ బాబు, ప్రొటెం స్పీకర్ ఎమర్జెన్సీ మీటింగ్

Sridhar Babu

Sridhar Babu

ఈరోజు లోక్సభలోకి ఆగంతకులు చొచ్చుకునిపోయిన సంఘటన తెలిసిందే. ఇదే విషయమై సాయంత్రం ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రొటెం స్పీకర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ అత్యవసర సమావేశంలో ఆగంతుకుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ తరహా సంఘటనలు జరగకుండా తీసుకోవల్సిన భద్రత చర్యలపై ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.

Read Also: CM Revanth: భూ సంబంధిత వివాదాలకు పరిష్కారానికి ప్రత్యేక కమిటీ

శాసనసభ సమావేశాలు సజావుగా సాగాడానికి మూడెంచెల భద్రత చర్యలను పటిష్టంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ప్రొటెం స్పీకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జారీ చేయబడ్డ పాసులు తప్ప ఇతరత్రా అన్ని రకాల పాసుల జారీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మండలి చైర్మెన్, శాసనసభ ప్రొటెం స్పీకర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, డి.జి.పి., హైదరాబాదు పోలీసు కమీషనర్ తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: Ponnam Prabhakar: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. నేను మంత్రిని అయినా కరీంనగర్ బిడ్డనే..

Exit mobile version