NTV Telugu Site icon

Minister Sridhar Babu: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందే బీఆర్ఎస్..

Sridhar Babu

Sridhar Babu

నాగ్ పూర్ లో జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ సభకు లక్షలాది మంది తరలి రావాలి అంటూ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. దేశ సంపద కొల్లగొడుతూ.. మత రాజకీయాలు చేస్తుంది బీజేపీ.. బీజేపీ ముక్త్ దేశం కావాలని నాగ్ పూర్ లో కాంగ్రెస్ అగ్ర నేతలు పిలుపు ఇవ్వనున్నారు.. ఏడాదికి 2కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని మాటలు చెప్పినా బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు పికేస్తుంది.. కాంగ్రెస్ ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తే.. బీజేపీ ప్రైవేట్ పరం చేస్తుంది అని ఆయన ఆరోపణలు గుప్పించారు. వికలాంగులకు 6 వేల రూపాయల పెన్షన్ పెంచాం.. త్వరలోనే చెల్లిస్తామన్నారు. మా ప్రభుత్వం ఏర్పాటై ఇంకా 20 రోజులు కూడా కాలేదు.. ఆరు గ్యారెంటీల హామీలలో ఈనెల 9న రెండు గ్యారెంటీలు అమల్లోకి తీసుకు వచ్చామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.

Read Also: TSUTF Committee: గురుకుల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలి..

తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జీరో టికెట్లు ఇచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మా కమిట్మెంట్ ఎలా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసింది.. అసెంబ్లీలో మేము శ్వేత పత్రం విడుదల చేశాం.. కేటీఆర్ విడుదల చేసిన స్వేద పత్రంలో ఔటర్ రింగ్ రోడ్డు కట్టినట్లు ఫోటో పట్టుకున్నారు.. ఔటర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ అనే విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ఖజానాకు చెందిన ప్రతి పైసా ప్రజలకు చెందాలి తప్ప నలుగురి కుటుంబ సభ్యులకు కాదు.. ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది.. ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తాం.. మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. ఈనెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో రేషన్ కార్డుల కోసం దరఖస్తులు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.