NTV Telugu Site icon

Minister Seethakka: మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసు

Seethakka

Seethakka

పండగపూట కూడా తమ వెంటపడి అనవసరంగా తప్పుడు కూతలు కూస్తున్నాడని కేటీఆర్‌ను మంత్రి సీతక్క విమర్శించారు. మీ కుటుంబం, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారన్నారు. “మా బాధ ఆవేదన కేటీఆర్ కుటుంబ సభ్యులకు తప్పకుండా తగులుతుంది.. ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ప్లాట్లు అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది.. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం, కష్టం, నిజాయితీ ముందు నువ్వెంత..? రాహుల్ గాంధీని అనే స్థాయి కేటీఆర్‌ది కాదు. బీసీ, ఎస్టీ మంత్రులుగా ఆర్థిక నేపథ్యంతో కాకుండా.. స్వతంత్రంగా ఎదిగాం. మేం సమ్మక్క సారలమ్మ, రాణి రుద్రమ్మ ప్రాంతాల నుంచి వచ్చాం.. ఎందుకు మా మీద అక్కస్సు. వరదల్లో మునిగి ప్రజలు నష్టపోవద్దని ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. బీఆర్ఎస్.. ప్రజల ఇళ్లను కూలగొట్టి బుల్డోజర్ ప్రభుత్వం నడిపారు. మా ప్రభుత్వంలో ప్రజలే స్వచ్ఛందంగా కూల్చుకుంటున్నారు. మూసి కూల్చివేతల అంశంలో.. పేదలకు నష్టం రాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారు.” అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.

READ MORE: Heavy Rains: విజయవాడలో భారీ వర్షం.. దసరా ఉత్సవాల పనులకు ఆటంకం

మమ్మల్ని అసభ్యకరంగా దూషించి మమ్మల్ని శిఖండి అని ఎట్లా అంటారు..? అని సీతక్క ప్రశ్నించారు. “గత మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసు.. మేం నామినేట్ చేస్తే.. అప్పనంగా వచ్చినోళ్ళం కాదు.. ప్రజలను చేత ఎన్నుకున్న మంత్రులం. వెంటపడి మమ్మల్ని వేధిస్తున్నారు దుర్మార్గులు. పనికట్టుకొని సినిమా వాళ్ళ గురించి మేము మాట్లాడట్లేదు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుంది.. సందర్భాన్ని బట్టి కొంతమంది సినీ ప్రముఖులపై మాత్రమే మాట్లాడారు. సినిమా యాక్టర్లకు మేము వ్యతిరేకం కాదు. వాళ్ళను ద్వేషించడం లేదు. పండగపూట ప్రజలను ఆడబిడ్డలను ఆనందంగా ఉంచాలి. బతుకమ్మ అంటేనే చెరువులను పూజించే పండుగ పూలను పూజించే పండుగ. ప్రపంచంలోనే పువ్వులను పూజించే అత్యంత గొప్ప పండుగ. ఆడబిడ్డలు తల్లిగారింటికి వచ్చి కష్టాలను పంచుకునే పండుగ బతుకమ్మ. కనీసం ఈ తొమ్మిది రోజులైనా ఆడ కూతురులను స్వేచ్ఛగా ఆడుకోనివ్వండి. ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి వచ్చే విధంగా కుటుంబాలు ప్రోత్సహించాలి. అండగా ఉండాలి.” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణ మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.