మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. వరి ధాన్యం కొనుగోలు ఎప్పుడు ప్రారంభిస్తారు.. బోనస్ కింద రూ.500 ఎప్పుడు ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారం చేపట్టి రెండు రోజులు కూడా కాకముందే.. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పందగా ఉందని తెలిపారు. ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు.
Read Also: MP Danish Ali: వివాదాస్పద ఎంపీ డానిష్ అలీని పార్టీ నుంచి బహిష్కరించిన మాయావతి..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు బోనస్ ఇచ్చారా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. వడ్ల కొనుగోళ్లలో మోసం చేశారని, క్వింటాల్ కు 10 కిలోలు కటింగ్ చేసి.. రైతులను ఇబ్బంది పెట్టారని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదన్నారు. రైతుబంధు ద్వారా వందల ఎకరాలు ఉన్నవారికే బెనిఫిట్ అవుతుందని చెప్పారు. పెద్ద ఫాంహౌస్ ల ఓనర్లు, మాజీ మంత్రులు రైతుబంధు రాలేదని బాధపడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన తర్వాత రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా లక్షల కోట్లు అప్పులు చేశారని, విలాసవంతమైన భవనాలు కట్టుకుని దర్జాగా ఉన్నారని మంత్రి సీతక్క చెప్పారు.
Read Also: MP Danish Ali: వివాదాస్పద ఎంపీ డానిష్ అలీని పార్టీ నుంచి బహిష్కరించిన మాయావతి..
