NTV Telugu Site icon

Minister Niranjan Reddy: మజీద్‌ల వద్ద ముస్లిం సోదరులను కలిసిన మంత్రి నిరంజన్ రెడ్డి

Niranjan Reddy

Niranjan Reddy

Minister Singireddy Niranjan Reddy: వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు మజీద్‌ల వద్ద శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముస్లిం సోదరులను కలిశారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉందని.. మీకు అండగా నిలిచిన పార్టీని, ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల వసతులతో షాదీఖానాల నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలో మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.లక్షా 116లను అందజేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. ప్రచారం మంత్రి వెంట మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Singireddy Vasanthi: అభివృద్ధే లక్ష్యం.. మంత్రి నిరంజన్ రెడ్డిని మరొకసారి ఆశీర్వదించాలి..

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తరపున మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి, కూతుర్లు ప్రత్యూష, తేజశ్వినిలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. వనపర్తిని జిల్లా కేంద్రం కావడంతో నూతన మండల ఏర్పాటులో భాగంగా గ్రామ పంచాయతీగా ఉన్న శ్రీ రంగపురంను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండల కేంద్రంగా ఏర్పాటు చేశారని.. ఆయనను మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు.  శుక్రవారం మండల నాయకులతో కలిసి వారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో రూ.20 లక్షలతో సబ్ సెంటర్, రూ.10లక్షలతో నూతన డ్రైనేజిల నిర్మాణం, రూ.కోటి 84 లక్షలతో 35 సీసీ రోడ్ల నిర్మాణం, రూ కోటి 98 లక్షలతో మిషన్ భగీరథ పథకం ద్వారా 1132 నల్లా కలెక్షన్లు, రూ.31 లక్షలతో కేజీబీవీ భవన నిర్మాణం, రూ 31 లక్షలతో ఎంఆర్సీ భవనం, రూ 85 లక్షలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతుల నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పనులను మంత్రి నిరంజన్ రెడ్డి చేశారన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న మంత్రి నిరంజన్ రెడ్డిని మరొకసారి ఆశీర్వదించాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.