NTV Telugu Site icon

Minister Niranjan Reddy: సంక్షేమంలో మనమే నంబర్ వన్

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy: పెన్షన్ల విషయంలో చత్తీస్‌గఢ్‌, కర్ణాటకలో రూ.200, మధ్య ప్రదేశ్ , గుజరాత్‌లో రూ.600 ఇస్తున్నారని.. దివ్యాంగులకు అండగా నిలిచి రూ.4016 ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. మిగిలిన వారి కంటే మేము ఏ విషయంలో తక్కువ కాదు అని అన్ని సందర్భాల్లో దివ్యాంగులు నిరూపించారన్నారు. దివ్యాంగులకు చాలా మందికి వాహనాలు అందచేశామన్నారు. మీ సమస్యలు ఏమైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరకు రావచ్చని.. రాలేని వారు నా నెంబర్‌కు ఒక మెసేజ్ పెట్టండి మీ సమస్యను పరీక్షిస్తాను మీ మీద ప్రేమ ఎల్లపుడు ఉంటుందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో మన వనరులు అన్నింటిని వాడుకుని రెండు సంవత్సరాలు కరోనా మూలంగా పోయినా.. కూడా మిగిలిన 7.5 ఏండ్ల కాలంలో వ్యవసాయం, ఆర్థిక పురోగతి, మిషన్ భగీరథ, ఐటీ రంగాల్లో దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. రహదారులు, గుట్టలు, చెరువులు, కుంటలు, రిజర్వాయర్‌లలో సాగునీళ్లు మినహా గుంట భూమి లేకుండా పచ్చగా వ్యవసాయం జరుగుతుందన్నారు. మనం పెట్టుకున్న గోల్ ఉంది అందుకు తగ్గ ప్రణాళిక ఉందని.. అది మిగతా పార్టీలకు అన్నీ అర్థం కావు తెలంగాణ ప్రభుత్వంతోనే అది సాధ్యమవుతుందన్నారు. మీరంతా ఉన్నత విద్యను చదువుకున్న వారు సమర్థులు కావాలా వద్దా అనేది మీ చేతిలో ఉంది అది మీరు అర్థం చేసుకోవాలన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి నియోజకవర్గంలో ఉన్నత విద్యావంతులు పాలనను అందించారని.. అలాంటి ఉన్నత విద్యావంతులు ఎన్నుకున్న ప్రజలు మీరేనని ఆయన అన్నారు.

Read Also: PM Modi Tirumala Tour: తిరుమల పర్యటనకు ప్రధాని మోడీ.. శ్రీరచన అతిథి గృహంలో బస

నిరంతరం తిరుగుతూ పనులు చేయడం వల్ల ప్రజల ఆదరణ ఎనలేనిదని మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గంలో దివ్యాంగులు 6 వేల మందికి పైగా ఉన్నారని.. దివ్యాంగులు పింఛన్ తీసుకునే స్థాయి నుంచి పది మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. 5 రోజులు నిరంజన్ రెడ్డికి సమయం ఇవ్వండి 5 సంవత్సరాలు మన కోసం పని చేస్తారని చెప్పారు. కరోనా వల్ల దేశం మొత్తం స్తంభించినా ఒక్క తెలంగాణ రాష్టంలో మాత్రం వ్యవసాయం ఆగలేదని.. అందుకు కారణం సీఎం కేసీఆర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలేనని ఆయన ప్రశంసించారు. ఇవాళ మంత్రి నిరంజన్‌రెడ్డి నందిమల్ల గడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొబైల్ అసోసియేషన్ సభ్యులు, జీ గార్డెన్‌లో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం, సూర్య చంద్ర పాఠశాలలో ప్రవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మంత్రి కూతురు ప్రత్యూష, రీజనల్ అథారిటి సభ్యులు నాయకుడు శ్రీనివాస్ గౌడ్, మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు