టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పై మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్ నాకు చాలెంజ్ చేసారు.. మత్స్యకారులకు, ఉత్తరాంధ్రాకు ఏం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చినబాబు నీకు దమ్ము, సిగ్గు లజ్జా ఉంటే.. మీ నాన్న కొబ్బరికాయ కొట్టిన పోర్టు, హార్పర్ ఇది అని చూపించు అని చాలెంజ్ చేశారు. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి ప్రాంతాల నడుమ నిలబెట్టడానికి జగన్ కృషి చేస్తున్నారని మంత్రి సీదిరి తెలిపారు.
Read Also: YCP: అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న ఇంఛార్జుల మార్పుల కసరత్తు
భారత్లో పెద్ద నగరాలు అభివృద్ధి చెందాయంటే.. వాటికి తీర ప్రాంతమే కారణమని మంత్రి సీదిరి అన్నారు. మీ నాన్న చంద్రబాబుకు తీర ప్రాంతంఉంది, మత్స్యకారులు వలస పోతున్నారని ఎందుకు తెలియలేదని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు మీకు చేత కానిది.. సీఎం జగన్ పోర్టుని సుసాధ్యం చేసారని అన్నారు. బైక్ ర్యాలీతో పోర్టు వైపుకు కూడా రండి అని తెలిపారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు మేకప్ కోసమే సమయం వెచ్చిస్తున్నారని విమర్శించారు.
Read Also: Bomb Threat to Airports: దేశంలోని 7 ప్రధాన ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు..
ఎంపీ రామ్మోహన్ నువ్వు మీ నాన్నా, మీ చిన్నాన్న ఒక్క అభివృద్ది పనిచేసారా జిల్లాకు అని మంత్రి ప్రశ్నించారు. ఉత్తరాంధ్రాకు ఏం చేసామో మేం సగర్వంగా చెప్పగలం.. చర్చకు రండి అని సవాల్ విసిరారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఏపీ దేశానికే దిక్సూచిగా నిలబడనుందని మంత్రి పేర్కొన్నారు.