Site icon NTV Telugu

Minister Seethakka: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత ఇలాకాకు సీతక్క

Seethalkka

Seethalkka

పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత ఇలాకాలో పర్యటించనున్నారు మంత్రి సీతక్క. రేపు (ఆదివారం) ఉదయం హైదరాబాద్ క్వార్టర్స్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ఉదయం 9:15 గంటలకు ములుగు మండలంలోని మహమ్మద్ గౌస్ పల్లికి చేరుకుంటారు. అనంతరం.. ఉదయం 10:15కు ములుగు గట్టమ్మ దేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Read Also: MLC Kavitha: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్

ఆ తర్వాత.. 11:30 గంటలకు ములుగు గట్టమ్మ నుండి రోడ్డు మార్గాన ర్యాలీగా బయలుదేరి మేడారం చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం.. మధ్యాహ్నం 3:00 గంటలకు జిల్లా అధికార యంత్రాంగంతో మేడారం జాతర రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4:30కు ఆదివాసి భవన్ మేడారంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 7: 30 గంటలకు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చేరుకుని అక్కడే బస చేస్తారు.

Read Also: Laxman: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది

Exit mobile version