Site icon NTV Telugu

Minister Seethakka: ఇంద్రవెల్లి సభకు లక్ష మంది వచ్చే అవకాశం

Seethakka

Seethakka

ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తొలి పర్యటన ఇక్కడి నుంచే జరుగుతుందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మొదటి టూర్ ఇంద్రవెల్లి నుంచే ప్రారంభించారు.. ఉమ్మడి జిల్లా అభివృది కోసం కృషి చేస్తామన్నారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి బహిరంగ సభ ఉంటుంది అని ఆమె చెప్పారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు. అమరవీరుల స్మృతి వనం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం భూమి పూజ చేస్తారు అని మంత్రి సీతక్క వెల్లడించారు.

Read Also: Andhra Pradesh Crime: ఇన్సూరెన్స్ డబ్బు కోసం స్కెచ్‌.. చనిపోయినట్లు నాటకం.. చివరి ఏమైందంటే..?

సీఎంకి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉంది అని మంత్రి సీతక్క తెలిపారు. అభివృద్ధికి ముందడుగు ఇక్కడి నుంచే బాటలు పడుతాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనక బడి ఉంది.. రేవంత్ రెడ్డి మొదటి సభ భట్టి విక్రమార్క పాదయాత్ర ఈ జిల్లా నుంచే ప్రారంభించారు.. అందుకే అధికారంలోకి వచ్చాక మొదటి సభ ఇక్కడ నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. రక్త హీనత సమస్య ఉంది.. రెండు పంటలకు నీరు లేదు.. వాళ్ళు కాంగ్రెస్ కట్టిన కడెం ప్రాజెక్టును పట్టించుకో లేదు.. ఎమ్మెల్యే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు.. భూతులు మాట్లాడుతున్నారు.. కావాలని విమర్శలు చేస్తున్నారు అని సీతక్క మండిపడ్డారు. ప్రొఫెసర్ కోదండరామ్ ను వాడుకున్నారు.. ఉద్యమ కారులకు గుర్తింపు రాకుండా కుట్రలు పన్నుతున్నారు.. ఉద్యమ పార్టీ కాదు వారిది కుటుంబ పార్టీ అని మంత్రి సీతక్క ఆరోపించారు. ఇంద్రవెల్లి సభకు లక్ష మంది వచ్చే అవకాశం ఉందన్నారు.

Exit mobile version