NTV Telugu Site icon

NTV Effect : మంత్రి సీతక్క ఆదేశాలతో జంగాలపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్

Minister Seethakka

Minister Seethakka

NTV Effect : మంత్రి సీతక్క ఆదేశాలతో వరంగల్ జిల్లా జంగాలపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్ చేశారు అధికారులు. RWS నీటి పరీక్షలు ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాల వల్ల సుమారుగా 17 మంది చనిపోవడం జరిగింది. జంగాలపల్లి గ్రామంలో ఉన్న ఆరోగ్య సమస్యల గురించి మంత్రి సీతక్క జిల్లా అధికారులను,వైద్య అధికారులను అప్రమత్తం చేసి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. DMHO గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి 3 రోజుల వరకు వైద్య పరీక్షలు చేసి చనిపోవడానికి కారణాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

Modi- Lulada Silva: ప్రధాని మోడీ భుజంపై చేయి వేసి మాట్లాడిన బ్రెజిల్ అధ్యక్షుడు.. (వీడియో)

గ్రామ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టే విధంగా జనాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి సీతక్క సూచించారు. గ్రామానికి సంబంధించిన నీటి సరఫరాలో ఏమైనా మలినాలు గాని క్రీములతో నీరు కలుషితం ఏమైనా జరిగిందా అని అనుమానం లేకుండా నీటిని కూడా పరీక్షలు చేసి గ్రామస్తుల్లో బయాన్ని పోగొట్టలని నీటిపారుదల అధికారులను అప్రమత్తం చేశారని, గ్రామస్తులు కూడా ఎవరికీ వారు వారి ఆరోగ్యాన్ని వ్యక్తిగతంగా కూడా కాపాడుకోవాలని ఎవరో ఏదో చెప్పారని నమ్మి జనాల్లో భయాన్ని సృష్టించవద్దని మూడ నమ్మకాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

Rajnath Singh: కోటి దీపోత్సవ ప్రభ మాటలకందని విధంగా ఉంది..

Show comments