NTV Telugu Site icon

Minister Seethakka: గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి..

Seethakka

Seethakka

గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. త్వరలోనే మహిళలకు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుందని అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు.

Kandula Durgesh : గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో కలెక్టరేట్, ఏరియా ఆసుపత్రి, ఐటిడిఏ, రామప్ప దేవాలయం ఆవరణాలలో మొత్తం నాలుగు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో మొదటి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ సంవత్సరం 20 వేల కోట్ల రూపాయలు రుణాలు బ్యాంక్ లీకేజీ ద్వారా అందించామని పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ప్రారంభించడం జరుగుతుందని.. నూతనమైన ఆహార పదార్ధాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.

ChatGPT in Telugu: తెలుగులో చాట్‌జీపీటీ.. జులై 10న డేటాథాన్‌ సదస్సు!

త్వరలోనే మహిళలు మీ సేవ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, డైరీ ఫాంలు, సోలార్ లైట్స్.. అదేవిధంగా 60 లక్షల పాఠశాల ఏక రూప దుస్తులను మహిళా సంఘాల ద్వారా కుట్టించామని పేర్కొన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లలో ఆహారం అమ్మ చేతి వంటల ఉండాలని.. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మహిళా శక్తి క్యాంటీన్లు దేశానికే ఒక బ్రాండ్ గా నిలవాలని, స్థానిక వనరులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మహిళా శక్తి బిజినెస్ మోడల్స్ ను త్వరలోనే రూపొందిస్తామన్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందించడంతో పాటు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు, క్యాంటీన్ల ఏర్పాటుకు అన్ని రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందించడంతోపాటు.. వడ్డీ లేని రుణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.

Show comments