NTV Telugu Site icon

Minister Seethakka : పండగపూట రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారు

Minister Seethakka

Minister Seethakka

రాఖీ పండుగ రోజు కూడా మహిళా మంత్రిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ ను నిందించడం కేటీఆర్ కే చెల్లిందని మంత్రి సీతక్క ఫైర్‌ అయ్యారు. పండగపూట రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని, మహిళా భద్రతకి మేము పెద్ద పీట వేస్తున్నామన్నారు. నేరాలకు కారణం అవుతున్న డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల వినియోగం పై ఉక్కు పాదం మోపామని, ఎనిమిది నెలల తర్వాత మహిళలపై అఘాయిత్యాలు మాకు గుర్తుకువచ్చాయని కేటీఆర్ చెప్పడం ఆయన అజ్ఞానానికి అద్దం పడుతుందన్నారు. మహిళలపై ఎక్కడ అఘాయిత్యం జరిగినా.. వెంటనే మా ప్రభుత్వం వాయు వేగంతో స్పందించిందని ఆమె తెలిపారు. గంటల వ్యవధిలోని నిందితులను అరెస్టు చేసిందని, నిoధితులపై చట్టపరంగా చర్యలు చేపట్టామన్నారు. లైంగిక దాడుల కేసుల్లో 24 మంది దోషులకు శిక్షలు పడేలా చేశామని మంత్రి సీతక్క తెలిపారు. 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష నుంచి యావజ్జివ కారగార శిక్ష వరకు దోషులకు శిక్షలు పడేలా చేశామని, మిగిలిన కేసుల్లోనూ న్యాయవిచారన కొనసాగుతోందన్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే బాధితులను పరామర్శించి భరోసా కల్పించామని, ఏలాంటి జాప్యం లేకుండా మంత్రులు, ఎంఎల్ఏ లు, అధికారులు, కార్పొరేషన్ చైర్మన్ లలో ఎవరో ఒకరు ప్రభుత్వం తరఫున వెళ్లి బాధిత కుటుంబానికి అండగా నిలిచారన్నారు మంత్రి సీతక్క.

Reliance Jio: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అత్యధిక డేటాతో టాప్ 3 ప్లాన్‌లు ఇవే..!

అంతేకాకుండా..’కేటీఆర్ అబద్దాలను పదేపదే మాట్లాడితే నిజాలు కావు. మీ హాయాములో మహిళలపై లక్షన్నరకు పైగా నేరాలు జరిగితే, ఎన్ని కేసుల్లో మీరు బాధితులను పరమార్శించారు?. మహిళలపై దాడులు జరిగితే బయటికి రాకుండా తొక్కి పట్టిన చరిత్ర మీది. విచ్చలవిడిగా పబ్బులు, క్లబ్బులు, డ్రగ్స్ వ్యాపారం జరిగినా నియంత్రించని అసమర్థులు మీరు. మీ హయాంలో మహిళల పై జరిగిన దాడులను ప్రస్తావిస్తే ఎందుకు ఉలికి పడుతున్నారు. మహిళలను బ్రేక్ డాన్సర్లు, రికార్డింగ్ డాన్సర్లుతో పోల్చడం చిన్న విషయమా?. కోట్ల మంది శ్రామిక, సామాన్య మహిళలని కించ పరచడం మీ దొర పోకడకు నిదర్శనం. ప్రజలు బుద్ధి చెప్పినా మీ దురంకారం దోరంకారం పోలేదు. మహిళా భద్రత మీ ప్రభుత్వంతో మొదలు కాలేదు, మీతో అంతం కాలేదు. వరంగల్లో అమ్మాయిలపై యాసిడ్ దాడి జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలుసు. అప్పుడు దటీజ్ వైయస్సార్ అని అంతా అభినందించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మహిళా పోలీస్ స్టేషన్లను ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వo. మహిళా భద్రత కోసం పోలీస్ శాఖలో మహిళా సిబ్బందిని రిక్రూట్ చేసింది కాంగ్రెస్. బాధితులకు భరోసా కల్పించేందుకు మహిళా పోలీస్ సిబ్బందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళా భద్రతకు కాంగ్రెస్ ఏం చేసిందో… అప్పుడు కాంగ్రెస్ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి తెలుసు. ఎప్పుడూ లేనివిధంగా మొదటిసారి 138 మంది మహిళా ఎస్ఐలను, 2400 మంది మహిళా పోలీస్ కానిస్టేబుల్ లను రిక్రూట్ చేసి శిక్షణ ఇస్తున్నాం. ఆస్తులు అంతస్తులతో నిమిత్తం లేకుండా ఇప్పటికైనా మహిళలను గౌరవించడం కేటీఆర్ నేర్చుకోవాలి’ అని మంత్రి సీతక్క అన్నారు.

Damodara Raja Narsimha : మంకీపాక్స్‌పై ముందస్తు చర్యల్లో భాగంగా ఉన్నత స్థాయి సమీక్ష