Site icon NTV Telugu

Minister Seethakka: కేటీఆర్ పై మండి పడ్డ మంత్రి సీతక్క..

Seethakka

Seethakka

Minister Seethakka – KTR: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రస్తుత మంత్రి సీతక్క మండి పడ్డారు. ఇందులో భాగంగా గత 10 ఏళ్లలో కేటీఆర్ ఎప్పుడైనా ఓయూకి వెళ్ళాడా.? కేటీఆర్ మాటలు.. కోట శ్రీనివాస్ రావు కోడి కథ లెక్క ఉందని ఆమె మండి పడింది. డబుల్ పించన్ మీ హయంలో తీసుకున్న వాళ్ళు కేవలం 5 వేల పై చిలుకు మాత్రమే అని., మళ్లీ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ తీసేశారని., మీ పార్టీ నాయకులు. మాత్రం ఇంట్లో రెండు పెన్షన్ లు తీసుకున్నారని., ధరణి తెచ్చి పేదలకు పట్టాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆమె మంది పడింది. అంతేకాకుండా పదేళ్లలో ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు.? పేదలకు ఎంత మందికి ఇండ్లు ఇచ్చారు.? ఔట్ సోర్స్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని వాళ్ళు మీరు అంటూ మాట్లాడారు.

Manushi Chhillar Dating: మాజీ సీఎం మనవడితో హీరోయిన్ మానుషి డేటింగ్‌?

ఎన్నికల సమయంలో మీ మేనిఫెస్టో ఎందుకు అమలు చేయలేదని., మేము చెప్పిన దాని కంటే ఎక్కువ ఇస్తాం అని., బిఆర్ఎస్ మేనిఫెస్టో లో పెట్టారు అంటే మీరు కూడా మోసం చేస్తానికే చెప్పారా అంటూ ఫైర్ అయ్యింది. మీ లాగా రుణమాఫీ చేయలేదని., తమ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నమని తెలుపుతూనే.. మీరు చాలా చేయలేదు.., కానీ మేము చేసి చూపిస్తాం అంటూ సీతక్క మాట్లాడింది.

LULU Mall: FSSAI నుండి 5 స్టార్ రేటింగ్ ను అందుకున్న లులు మాల్..

Exit mobile version