NTV Telugu Site icon

Minister Seethakka : ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి

Seethakka

Seethakka

ఆదిలాబాద్ నియోజకవర్గానికి 3500 ఇళ్లు నిరుపేదలకు అందించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ అంటేనే గ్యారంటీలకు గ్యారెంటీ అన్నారు. ధరణితో దొరలకే లబ్దిచేకురిందన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ కు వారెంట్ లేదన్న బీఆర్ఎస్ఎటు పోయిందన్నారు. పేదలకు కట్టిన ఇల్లు ఇవ్వని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. సొంత ఆస్తులు పెంచుకున్న ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్నారు. గత ప్రభుత్వాలు జిల్లాకు అన్యాయం చేశాయన్నారు. చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల కుటుంబం కాని భోగాల కుటుంబం కాదన్నారు. పేద ప్రజల కోసం బిజెపి ఏం చట్టం తెచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. కుల మతాల పేరుతో అధికారం కోసం అలజడులు సృష్టిస్తుంది బీజేపీ అని ఆమె అన్నారు. ప్రధానమంత్రి సూటు బూటు ప్రధానమంత్రి అంటూ ఆమె చమత్కరించారు. అలాగే మిగిలిన గ్యారెంటీస్ పథకాలను త్వరలోనే పూర్తిస్థాయిలో అమలు చేస్తామని పేర్కొన్నారు.

Temperatures: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండ తీవ్రత.. మార్చి ప్రారంభంలోనే మండిపోతున్న భానుడు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని దానికి ప్రతినెలా 70 వేల కోట్లు వడ్డీ తీరుస్తున్నామని తెలిపారు. ధరణి పోర్ట్ లో సమస్యలు ఉన్నాయని త్వరలో ప్రక్షాళన జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సంపద పెంచుతుందని పేదలకు పంచుతుందని అన్నారు.బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, కుప్టి,ప్రణహిత ఎత్తిపోతల పథకం, నూతన సోనాల మండల ఏర్పాటు గురించి క్యాబినెట్లో చర్చిస్తానని తెలిపారు. రాబోవు ఎంపీ ఎలక్షన్లలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేయాలని ఆదిలాబాద్ ఎంపీ సీటును కైవసం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ సత్తు మల్లేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అవినాష్ రెడ్డి, జెడ్పిటిసి నరసయ్య, మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగయ్య వైస్ చైర్మన్ ఆడే వసంత్ నాయక్,అధికార ప్రతినిధి పసుల చంటి అన్ని మండలాల ఎస్సీ బీసీ ఎస్టీ సెల్ నాయకులు ప్రజా ప్రతినిధులు ప్రజలు రైతులు పాల్గొన్నారు.