Site icon NTV Telugu

Minister Seethakka : ఓడిపోయిన వారు అధైర్యపడొద్దు

Seethakka

Seethakka

ఆదిలాబాద్ జిల్లాపై సమీక్ష చేశారని అదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా వెనకబడిన ప్రాంతమని, ఇంద్రవెల్లికి ఈ నెల 26 తర్వాత సీఎం వస్తా అన్నారన్నారు. నియోజకవర్గ సమస్యలపై చర్చ చేశామని, పార్టీ బలోపేతం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఓడిపోయిన వారు అధైర్యపడొద్దు అని చెప్పారని, బీఆర్‌ఎస్‌ మమ్మల్ని బదనం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విధి విధానాలు కూడా రూపొందించక ముందే బీఆర్‌ఎస్‌ నేతలు మాటలు మట్లాడుతున్నారని, కూల్చుతం అని కడుపు మంట మాటలు అని ఆయన అన్నారు. అధికారం లేకపోతే ఉండలేకపోతున్నారని, వంద రోజుల సమయం మాకు ఉందన్నారు. అన్నిటినీ అమలు చేస్తామని, మీరిచ్చిన హామీలు…పదేండ్లు అయినా అమలు చేయలేదన్నారు. దొరలు మాత్రమే పాలించ గలరు.. ఇతరులకు ఆ తెలివి లేదన్నట్టు మట్లాడుతున్నారన్నారు. గత పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. మిగతా ప్రాంతాలకు దీటుగా ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారని తెలిపారు.

 

గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులు నియోజక వర్గాల వారీగా అభివృద్ధి ఎజెండా ప్రిపేర్ చేసుకోవాలని రేవంత్‌రెడ్డి చెప్పారన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా దుర్మార్గపు ఆలోచనలు మానాలని హితవు పలికారు. ప్రభుత్వాలు కూల్చడం, కాల్చడం మీద అంత శ్రద్ధ ఎందుకని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు పదవులు లేకపోయే సరికి తట్టుకోలేక పోతున్నారని సెటైర్లు వేశారు. ఆటో కార్మికులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చ గొడుతోన్నారని మండిపడ్డారు. మహిళలు ఫ్రీ గా బస్సులల్లో ప్రయాణం చేయడం బీఆర్ఎస్ నేతలకు నచ్చడం లేదా అని ప్రశ్నించారు. మహిళలకు 2500 రూపాయలు, గ్యాస్ 500, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ మలి విడతలో అమలు చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Exit mobile version