NTV Telugu Site icon

Seediri Appalaraju Open Challenge: హరీష్‌రావుకి ఇదే నా ఛాలెంజ్.. దమ్ముంటే ఏపీకి రా..!

Seediri Appalaraju

Seediri Appalaraju

Seediri Appalaraju Open Challenge: తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు.. టీఆర్ఎస్‌లో టీ తీసి బీ పెట్టినంత మాత్రాన ఏం కాదు.. అసలు టీఆర్ఎస్ పార్టీనే ప్రాంతీయ ఉన్మాదం మీద పుట్టింది.. ఆంధ్ర రాష్ర్ట ప్రయెజనాలకు విరుద్ధంగా పుట్టిన పార్టీ అంటూ మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఆంధ్ర ప్రజలను పూర్తిగా అవమానపరుస్తూ, ప్రయెజనాలు విస్మరిస్తూ ఆవిర్భవించింది అంటూ ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. హైదరాబాద్ పెట్టుబడులు ఎవరివి , ఆంధ్ర ప్రజలవి కావా..? అని నిలదీసిన ఆయన.. జాతీయవాదంలేని TRS ఎలా BRS అయిపోతుంది..? గోదారి జలాల విషయంలో కానీ, ఏపీ ప్రజల గూర్చి ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. మీలాగా కుటుంబం అంతా పాలించడానికి ఏపీ ఏమీ తెలంగాణ కాదు.. కూతురు, కోడుకు, అల్లుడు అంతా పాలించడానికి ఏపీ కుటుంబపాలనకు అంగీకరించదు అని వ్యాఖ్యానించారు.

ఆధార్ కార్డ్ చేసుకోండి, ఓటు కార్డ్ చేసుకోండని తెలంగాణవాళ్లు అడుక్కుంటున్నారంటూ మండిపడ్డారు మంత్రి అప్పలరాజు.. టీజీ, ఒడిశా నుంచి ఏపీకి చాలా మంది వస్తున్నారు. ఏపీ గురించి మాట్లాడాలంటే ఇక్కడి వచ్చి చూసి మాట్లాడాలని హితవుపలికారు.. హరీష్‌రావుకు ఇదే నా ఛాలెంజ.. దుమ్మంటే ఏపీకిరా? అంటూ సవాల్‌ చేశారు.. మా గ్రామాలు రండి.. స్కూల్స్ ఎలా ఉన్నాయో వచ్చి చూడండి… ఇంటి ఇంటికి ఏం చేసామె ప్రతి ఇంటికి వెళ్లి అడగండి చెబుతారు.. మీరెందుకు చెప్పలేఖ పోతున్నారు.? అని ఫైర్‌ అయ్యారు. ఇక, సీఎం కేసీఆర్‌ ఎందుకు ఏమీ చెప్పలేకపోతున్నారు.. ఎన్నికల ముందు దళితబందు అంటే నమ్మే పరిస్థితిలేదన్నారు.. దొరల పాలన ఎవరూ నమ్మటంలేదన హాట్‌ కామెంట్లు చేశారు..

బీఆర్ఎస్‌ను తెలంగాణలో కూడా ఈడ్చి తంతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అప్పలరాజు.. ఏపీలో బీఆర్ఎస్ కు అడ్రస్ ఎప్పటికీ ఏర్పడదు.. మా కుండ బిర్యానీని , గోదారి రుచుల్ని అవమానించిన వారు, మా ప్రాంత మనోభావాలు అవమానించిన వారిని ఎవరూ ఏపీలో అంగీకరించరన్నారు. ఏపీలోనే కోవిడ్ సమయంలో ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత ట్రీట్ మెంట్ ఇచ్చాం.. స్టీల్ ప్లాంట్ విషయంలో విశాఖ కార్మికులతో ఇంటరాక్షన్ సీఎం జగన్ గతంలో పెట్టారన్నారు.. విశాఖ స్టీల్ ఎలా కాపాడుకోవాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారు.. కేందర ప్రభుత్వం ప్రైవేటీకరణకు ముందుకు వెళ్తే మేమే బిడ్ వేయాలని భావిస్తున్నామని వెల్లడించారు మంత్రి సీదిరి అప్పలరాజు..