NTV Telugu Site icon

Seediri Appalaraju: మంత్రి అప్పలరాజు సవాల్‌.. అది నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా..!

Appalaraju

Appalaraju

Seediri Appalaraju: టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బహిరంగ సవాల్‌ విసిరారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో ఒక్క పోర్ట్ , ఒక్క హార్బర్‌కు శంకుస్థాపన చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలు విడిచిపెట్టేస్తానని ప్రకటించారు.. అచ్చెన్నాయుడుకు పోయేకాలం వచ్చిందని మండిపడ్డ ఆయన.. అందుకే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు.. దువ్వాడశ్రీను అనే మొగుడ్ని అచ్చెన్నాయుడు మీద సీఎం జగన్‌ ప్రకటించారు.. ఈ సారి దమ్ముంటే గెలిచి చూపించాలంటూ మరో సవాల్‌ విసిరారు..

Read Also: Andhra Pradesh Crime: అమ్మాయితో లవ్‌..! ఎగ్జామ్‌ హాల్‌లో 9వ తరగతి విద్యార్థిపై దాడి..

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చిద్దామా.. ? అని చాలెంజ్‌ చేసిన మంత్రి అప్పలరాజు.. రూపాయి ఖర్చుతో సహా చెప్పగలను.. దమ్ముంటే అచ్చెన్నాయుడు చర్చకు రా అంటూ సవాల్‌ చేశారు.. కళ్లు కనిపించడంలేదా..? మేం చేస్తున్న ప్రోజెక్టులు మీ ముందు లేవా? అని నిలదీశారు.. శ్రీకాకుళం జిల్లాకు ఇది చేశామనా అచ్చెన్నాయుడు చెప్పగలరా? అంటూ పేర్కొన్న ఆయన.. సీఎం వైఎస్‌ జగన్ మెహన్ రెడ్డిని విమర్శించే ముందు అచ్చెన్నాయుడు ఆలోచించి మాట్లాడాలంటూ హితవు పలికారు.. 989 కిలోమీటర్లు తీరప్రాంతం ఉన్న రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏం చేశారు? చంద్రబాబు దూర దృష్టి ఏంటి..? విజనరీ ఏంటి .. ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు తీర ప్రాంతానికి చంద్రబాబు చేసింది గుండు సున్నా అని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. కాగా, నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విషయం విదితమే.