Seediri Appalaraju: శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏపీ సీఎం జగన్ ప్రజల కోసం రెండు ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. వైఎస్సార్ ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్‌కు, ఆంధ్రా యూనివర్సిటీ ఆర్గనైజేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. విశాఖలో పవన్ మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.
Read Also: KA Paul: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నేనే కారణం..
తెలంగాణలో ఉత్తరాంధ్ర, ఆంధ్రా బీసీలను ఓసీలో 2015లో మార్చారని, అప్పుడు ప్రశ్నించకుండా పవన్ ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబుకి అప్పుడు పవన్ మిత్రుడే కదా అంటూ ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికలకు ముందు గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఎందుకు అడగలేదని ప్రశ్నలు గుప్పించారు. మా మీద పడి అవగాహన లేకుండా మాట్లాడటం ఏంటి అంటూ మండిపడ్డారు. వలసలు ఆగాలంటే విశాఖ రాజదాని కావాలన్నారు. బోగాపురం ఎయిర్‌పోర్టు, ఇన్ఫోసిస్, మూలపేట పోర్ట్.. ఉత్తరాంధ్ర అభివృద్ధి కాదా అంటూ ప్రశ్నించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని చేశారని.. ఆయనను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. తుఫాన్‌తో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆదేశించామని ఈ సందర్భంగా చెప్పారు.