Site icon NTV Telugu

Satyavathi Rathod: అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలి

Satyavathi

Satyavathi

అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలి అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. ప్రభుత్వం జీవో విడుదల చేసిన తరువాత సమ్మె చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఎక్కువ మంది బలహీన వర్గాల వారే ఉన్నారు.. వారిని ఇబ్బందులకు గురి చేయొద్దు.. అంగన్వాడిల సర్వీస్ ను కొనసాగించాలి.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది అని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

Read Also: Business Idea: తక్కువ పెట్టుబడితో బిజినెస్ చెయ్యాలా? ఇటు ఓ లుక్ వేసుకోండి..

కొందరు ఉద్దేపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసమే అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పుకొచ్చారు. అంగన్వాడీలు వాస్తవాలను గ్రహించి వెంటనే విధులకు హాజరుకావాలి.. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని ఆమె చెప్పారు. అంగన్వాడీలు రెగ్యులర్ చేయాలని డిమాండ్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం.. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం అనేది కష్టం అని సత్యవతి రాథోడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అంగన్ వాడీల తరుపున లేఖ రాస్తాం అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అవసరమైతే మేము స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి అప్పీల్ చేస్తామని ఆమె పేర్కొన్నారు. అంగన్వాడీలు వెంటనే డ్యూటీల్లోకి జాయిన్ కావాలని కోరారు.

Read Also: Vivek Ramaswamy: చైనాను అడ్డుకోవాలంటే భారత్‌తో బంధం బలపరుచుకోవాల్సిందే.. రిపబ్లికన్ నేత వ్యాఖ్యలు..

Exit mobile version