Site icon NTV Telugu

Satya Kumar Yadav: 22 మంది డాక్టర్లు, న‌ర్సుల‌పై చ‌ర్యలు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం

Satyakumar Yadav

Satyakumar Yadav

22 మంది డాక్టర్లు, న‌ర్సుల‌పై చ‌ర్యలు చేప‌ట్టేందుకు విచార‌ణ‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. 2020లో అన‌కాప‌ల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాసుప‌త్రిలో జరిగిన నిర్వాహకాలపై చర్యలకు ఉపక్రమించారు. ఫిబ్రవరి, 2020లో ఏసీబి ఆక‌స్మిక త‌నిఖీలో అక్రమాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది జూన్ లో ఏసీబీ అధికారులిచ్చిన నివేదిక‌ను పరిగణలోకి తీసుకున్న మంత్రి చర్యలకు ఆదేశించారు. అవినీతి, పాల‌న వైఫల్యాలు, ప‌ర్యవేక్షణ లోపాల్ని గుర్తించారు. ఇన్‌పేషెంట్లపై త‌ప్పుడు లెక్కలు.. మందుల వినియోగాన్ని సరిగా చూప‌ని న‌ర్సులు.. గ‌త ప్రభుత్వ హ‌యాంలో ప‌రిస్థితికి అద్దంప‌ట్టింది ఏసీబీ నివేదిక‌.

Also Read:TCS: ఉద్యోగులకు టీసీఎస్ భారీ షాక్.. 12,000 మంది తొలగింపు..

డిసిహెచ్ య‌స్‌ తోపాటు మ‌రో తొమ్మిది మంది వైద్యులు, 12 మంది హెడ్ న‌ర్సులు, స్టాఫ్ నర్సులపై తక్షణమే విచార‌ణ‌కు ఆదేశించారు. నిరంత‌ర స‌మీక్షలు, ప‌ర్యవేక్షణ‌పై దృష్టి సారించారు. గ‌తేడాది కాలంగా మంత్రి తరచుగా స‌మీక్షలు నిర్వహిస్తుండ‌డంతో అధికారుల్లో మార్పు కన్పిస్తోంది. అక్రమాల్ని అరిక‌ట్టే దిశ‌గా ఇటీవ‌ల జ‌రిగిన సాధార‌ణ బ‌దిలీల్లో జూనియ‌ర్‌, సీనియ‌ర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సూప‌రింటెండెంట్లు, అకౌంటెంట్లను వేరే కార్యాల‌యాల‌కు బ‌దిలీ చేశారు. ప‌లు ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, వైద్య క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్లను ప్రతిభ ఆధారంగా మార్చి, నియమించేలా చర్యలు
గత ప్రభుత్వ హ‌యాంలో ప‌రిస్థితిపై ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వాసుప‌త్రుల్లో మార్పు తెచ్చేందుకు ప‌టిష్టమైన చ‌ర్యల్ని చేప‌ట్టాల‌ని మంత్రి ఆదేశించారు.

Exit mobile version