Site icon NTV Telugu

Minister Satya Kumar Yadav: ఈ రోజు శుభదినం.. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోడీకి అభినందనలు..

Minister Satya Kumar Yadav

Minister Satya Kumar Yadav

Minister Satya Kumar Yadav: ఈ రోజు భారతదేశానికి శుభదినం.. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేస్తున్నాం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. జీఎస్టీ నెక్స్ట్ జెన్ పేరుతో నరేంద్ర మోడీ చిత్రం ఉన్న టీ షర్టులు ధరించి శాసన సభ, మండలి సమావేశాలకు హాజరయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ.. భారతదేశానికి ఈ రోజు శుభదినం అని పేర్కొన్నారు.. ఇక, జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చి నాలుగు స్లాబులను రెండు స్లాబులకు ప్రధాని తీసుకువచ్చారు.. దేశంలోని ప్రతి వర్గానికి మేలు చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.. అనేక వస్తువులను 12 శాతం, 18 శాతం నుంచి 5 శాతానికి తెచ్చారు అని వెల్లడించారు మంత్రి సత్య కుమార్ యాదవ్.. ప్రాణాధార ఔషధాలను సున్నా శాతం జీఎస్టీకి తెచ్చారు.. ఆర్థిక శాఖామంత్రి నిర్మల సీతారామన్ కు కూడా తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు అన్నారు.. హెల్త్ ఇన్సూరెన్స్ లపై ఉన్న జీఎస్టీని 18 శాతం నుంచి 0 శాతానికి తీసుకురావడం శుభపరిణామం అన్నారు.. జీఎస్టీ స్లాబులు మార్పులతో దసరా ముందుగా వచ్చిందని రాష్ట్ర ప్రజల భావిస్తున్నారు.. శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీఎస్టీ స్లాబ్ లను కుదించడంపై చేసిన తీర్మానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్..

Read Also: Rajnath Singh: ఆపరేషన్ సిందూర్-2, 3 పార్టులు పాక్ తీరుపై ఆధారపడి ఉంటుంది

Exit mobile version