Site icon NTV Telugu

Sabitha Indra Reddy: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి..

Minister Sabitha

Minister Sabitha

డీఈఓలు, ఆర్జేడీలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో అధికారులకు మంత్రి సబితా సలు సూచనలు చేశారు. తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అందజేయనున్నట్లు ఆమె వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54వేల 201 మంది కుక్‌-కమ్‌ హెల్పర్లకు లబ్ది చేకూరుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం ద్వారా సంవత్సరానికి రూ.108.40 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు.

Read Also: Etala Rajender: రైతుల కొంపలు ముంచడానికే ధరణి పోర్టల్

రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలు ఈ నెల నుండే ఇస్తాము అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మధ్యాన్న భోజన పథకానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలి.. విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలి అని ఆమె పేర్కొన్నారను. తొలిమెట్టును విజయవంతంగా అమలు చేసేందుకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా వార్షిక ప్రణాలికను విడుదల చేస్తామన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా స్టేట్ లెవెల్ అచీవ్ మెంట్ సర్వే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.

Read Also: Ishan Kishan: ఇషాన్ కిషన్, అజింక్యా రహానే మధ్య ఇంట్రస్టింగ్ కామెంట్స్.. నీకన్నా బెటర్..!

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు చేపట్టాలి అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి.. పలు జిల్లాల్లో విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తులు అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, మరో వారం రోజుల్లోగా అందజేయకపోతే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి సూచించారు.

Exit mobile version