పదవ తరగతి పరీక్షల పై మంత్రి సబితా రివ్యూ చేశారు. వచ్చే నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 24వ తేదీ నుండి ఆన్లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు, పాఠశాలలకు కూడా పంపుతాం అన్నారు మంత్రి సబితా. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారని, ఇందుకోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
Also Read : YSRCP On MLC Results: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలపై వైసీపీ పోస్టు మార్టం
త్వరలో డిఈఓ లు,ఆయా జిల్లాల కలెక్టర్లు,ఎస్పి లు,ఇతర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫెరెన్సు ద్వారా ఏర్పాట్లపై సమీక్షించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3 వ తేదీ నుండి 13 వ తేదీ వరకు ప్రతీ రోజు ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, విద్యార్థులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Also Read : IPL2023 : కేకేఆర్ కు వరుస షాక్ లు.. టోర్నీ నుంచి కీలక ప్లేయర్స్ ఔట్
అయితే.. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 3న పదవ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగుస్తాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.