మామిడి పల్లి గ్రామ పరిధిలోని రంగనాయకుల కాలనీ లో 12వ వార్డ్ లో బస్తీ దవాఖానను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం నిమ్మల శారదమ్మ స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలను బాగు చేసుకుంటున్న తరుణంలో వైద్య రంగానికి కూడా బాగుచేసుకోవాలని సీఎం కేసీఆర్ ఆలోచన అని ఆమె అన్నారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేయాలని హైదరాబాద్ జిల్లా చుట్టుప్రక్కన 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించనున్నారన్నారు. 4చోట్ల ఒక్కొక్క హాస్పిటల్ కు 1200 కోట్లు రూపాయలతో నిర్మించడం జరుగుతుందని మంత్రి అన్నారు. 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తయితే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లందరికీ కూడా మంచి వైద్యం అందించవచ్చని మంచి అవకాశంగా ఏర్పడుతుందని అన్నారు.
ఇప్పటికే గ్రామాలలో పల్లె దవాఖానలు, అర్బన్ ఏరియాలలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన, ఇప్పటికే హైదరాబాద్ సిటీలలో 300కు పైగా బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలో కూడా 22 బస్తీ దవాఖానలకు 10 బస్తీ దవాఖానలు మహేశ్వరం నియోజకవర్గానికి రావడం జరిగిందని, 4 బస్తా దవాఖానలు బడంగ్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అనంతరం నిమ్మల శారదమ్మ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను టాస్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ వైద్య అధికారులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.