చిత్తూరు జిల్లాలోని పూత్తురు రూరల్ పరమేశ్వర మంగళం, తిరుమల కుప్పంలో కొత్తగా నిర్మించిన రైతు భరోసా, సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలను మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం ఎన్నో బటన్లు నొక్కాడని.. 2024లో మీరు తమ కోసం రెండు బటన్లు నొక్కాలన్నారు. తొలి బటన్ ఎమ్మెల్యేకు, రెండవది ఎంపీ నొక్కి వైసీపీకి అండగా నిలవాలని మంత్రి రోజా కోరింది. ప్రజల వద్దకే పాలన వాలంటరీ వ్యవస్థ ద్వారా సాధ్యమైందన్నారు. మీ సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించే విధంగా వాలంటరీ వ్యవస్థ పని చేస్తుందన్నారు. రోజుల తరబడి పెన్షన్ కోసం ఎదురు చూసే రోజులు పోయి.. ప్రతినెల ఒకటో తేదిన ఉదయానికే వాలంటీర్లు పెన్షన్ తెచ్చి ఇస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు.
Read Also: Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ప్రియాంకా గాంధీ.?
ఇక, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మండల స్థాయికే వెళ్లే పని లేకుండా ఇంటి దగ్గరకే వాలంటీర్లు తీసుకొచ్చి ఇస్తున్నారని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల రైతులకు నష్టం జరిగితే రైతు భరోసా కేంద్రాల ద్వారా గుర్తించి వారికి సాయం అందుతోందని చెప్పారు. ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా రోగాన్ని గుర్తించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. సీఎం జగన్ గొప్ప గొప్ప వ్యవస్థలను నెలకొల్పాడు.. ఇలాంటి సౌకర్యవంతమైన పరిపాలన ఎవరైనా అందించారా అనేది ప్రజలు ఆలోచించాలని మంత్రి రోజా సూచించారు.
Read Also: Pakistan: కోర్టులో సరండర్ కానున్న నవాజ్ షరీఫ్ కుమారులు
అయితే, నాడు- నేడు కింద పాఠశాలలను మెరుగుపరిచి కార్పొరేట్ స్థాయిలో ఉన్నత విద్యను తీసుకురావడంతో పిల్లల చదువులు చక్కబడ్డాయని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ స్కూల్స్ పిల్లలు స్టేట్ ర్యాంకుల స్థాయికి ఎదిగారని ఆమె అన్నారు. విద్యలో జగనన్న తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక విధంగా లబ్ధి అందించే సహాయ సహకారాలను ప్రజలు గమనించాలని మంత్రి ఆర్కే రోజా అన్నారు.