Site icon NTV Telugu

Minister Roja: బాలయ్యపై ఫైర్.. మీ డైలాగ్ లన్నీ వేస్ట్

Roja2

Roja2

వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య డైలాగ్ లు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అయితే, మంత్రి ఆర్ కె రోజా బాలయ్య డైలాగులపై మండిపడ్డారు. తనదైన రీతిలో కౌంటర్ వేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లిలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు మంత్రి రోజా. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రోజా.. ముగ్గులపోటీ నిర్వహించి బహుమతులు అందచేశారు. కుటుంబ సబ్యులతో కలిసి పండగ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. చెల్లిగా , హీరోయిన్ గా , ఎమ్మెల్యేగా , మంత్రిగా ప్రతి ఏడాది ఇక్కడ పండగ చేసుకున్నాను. సంక్రాంతి రైతుల పండుగ , రైతులు ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్ కుటుంబ పాలనలో రైతులు సుభిక్షంగా ఉంటారన్నారు.

బాలకృష్ణ ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అన్నది అర్దం కావడంలేదు. బాలకృష్ణ గత ప్రభుత్వం పనితీరు చూసి ఇంకా అదే విధంగా ఉందనే అనుకుంటున్నాడు. చంద్రబాబు భ్రమలో నుంచి బాలకృష్ణ బయటకు రావాలన్నారు. స్ర్కిప్టులు రాసిఇచ్చినా మాట్లాడలేని పరిస్దితి. 11మంది చనిపోతే బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ జీవో నెంబర్ 1ని పూర్తిగా చదివారా? జగనన్న ప్రభుత్వాన్ని ఎమర్జెన్సీ అనడం హాస్యాస్పదం అని విమర్శించారు. తన అల్లుడు , కూతురు బాగుండాలని తన బావ మెప్పుకోసం ఇలా మాట్లాడి ఉండొచ్చు అన్నారు.

Read Also: Mukarram Jah: ఎనిమిదో నిజాం నవాబు ముకరం ఝా ఇకలేరు..

అన్ స్టాపబుల్ లో ఎన్టీఆర్ పై జరిగిన చర్చపై ప్రజలందరూ ఇదో స్ర్కిప్ట్ అని భాస్తున్నారు. చంద్రబాబు మోసాన్ని కప్పిపుచ్చేలా షో నడిపారు. ఎవరు చచ్చినా పరవాలేదు .. నా బావ మీటింగ్ జరగాలి … నా బావ కళ్ళలో ఆనందం చూడాలని బాలకృష్ణ అనుకుంటున్నారు. బాలకృష్ణకు తెలియదా ప్రజల కష్టాలు. ప్రజల సొమ్ముతో డబ్బులు సంపాదించి వారి డబ్బుతో మేడలు కట్టుకుని ఆ ప్రజలు చనిపోతే మాట్లాడరా? మూడుపంటలు పండే భూమిని ఎవరో స్వామీజి చెప్పారని బీడు భూమిని చేశారు. మహిళా సదస్సుకు రమ్మని నన్ను చంపాలని చూశారు. బాలకృష్ణ రెండు సార్లు గెలిచారు .. పవన్ లాగా రెండు సార్లు ఓడిపోలేదు మీకు ప్రజల కష్టాలు తెలుసు. జీవో నంబర్ వన్ పూర్తిగా చదివితే బాలకృష్ణ తను మాట్లాడిన ఎమర్జెన్సీ అనే మాట వెనక్కి తీసుకుంటారు. ఎమర్జెన్సీ అనడం సిగ్గుచేటు .. నీతి మాలిన చర్య.. సినిమాలో ఎన్ని డైలాగులు చప్పినా చప్పట్లు కొట్చుకోవడానికే తప్ప ప్రజల ఊళ్ళు బాగుపడవు అన్నారు మంత్రి రోజా.

Read Also: Army Chief: చైనా సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం..

Exit mobile version