NTV Telugu Site icon

Minister Roja: ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం.. నగరి నుంచే బరిలో ఉంటా..

Roja

Roja

నాన్ లోకల్ నేతలు జగన్ పై మాట్లాడుతూన్నారు అని మంత్రి రోజా తెలిపారు. విశాఖపట్నం మించిన సభ రాయలసీమలో జరుగుతుంది.. టీడీపీ అధినేత చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నాడు..
చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేడు.. వైఎస్ షర్మిల నాలుగో కృష్ణుడు లాంటిది.. రాష్ట్రాన్ని విభజించి, వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరింది అని ఆమె పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారు.. సంక్రాంతి అల్లుళ్ళు లాగా వస్తున్నారు.. ఆవిడ వేషం కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబు ది.. ఆమె మాటలకు విలువ లేదు అని మంత్రి రోజా వెల్లడించారు.

Read Also: Nizamabad CI Arrest: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. నిజామాబాద్ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్..!

ఇక, తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది.. ఇప్పుడు ఆమె మాటలకు అర్థం లేకుండా పోయింది అని మంత్రి రోజా పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వాడు నా గురుంచి మాట్లాడుతుండడం సిగ్గుచేటు అని ఆమె మండిపడ్డారు. 10 ఏళ్లలో నేను ఒక్క రూపాయి తీసుకోలేదు.. ఒంగోలు నుంచి నేను పోటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. నగరిలో ఉన్న నాకు ఒంగోలుకు పోవాల్సిన అవసరం లేదు.. టీడీపీ- జనసేనకు అభ్యర్థులు లేరు.. పెద్దిరెడ్డి గురించి ఆదిమూలం మాటలు బాధ పెట్టాయి.. ఆయన్ను గెలిపించింది పెద్దిరెడ్డి.. కక్ష సాధింపుగా ఆయన మాట్లాడారు అని ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీలో మార్పులు- చేర్పులు అర్థం చేసుకోవాలన్నారు. సీట్లు కోల్పోయిన వారికి తప్పక న్యాయం జరుగుతుంది.. జగన్ మళ్లీ సీఎం కావడం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంతో కష్టపడుతున్నారు.. ఆదిమూలం రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు.