NTV Telugu Site icon

Rk Roja: సీఎం జగన్ ను విమర్శిస్తే.. మర్యాద దక్కదు బ్రాహ్మణి..?

Roja

Roja

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సతీమణి నారా బ్రాహ్మణిపై మంత్రి ఆర్కే రోజా కౌంటర్‌ ఎటాక్‌ దిగారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు వంటి పేద ప్రజల కోసం.. వారి సంక్షేమం కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆలోచించారా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో దోరికిపోయి జైల్లో కూర్చుంటే సిగ్గు లేకుండా చంద్రబాబు భార్య, ఆయన కోడలు గంట కొట్టండి, విజిల్స్ వేసి సీఎం జగన్ కు బుద్ది చెప్పండీ అంటున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా బ్రాహ్మణి తెలియక మాట్లాడుతోందో.. తెలిసి అబద్ధాలు ట్వీట్ చేస్తున్నారా అనేది అర్థం కావాడం లేదని మంత్రి రోజా అన్నారు.

Read Also: Rakshasa Kavyam: అరడజను సినిమాలు.. వెనక్కి తగ్గి అక్టోబర్ 13న “రాక్షస కావ్యం”

రాష్ట్రంలో పెద్ద సైకోలు ఎవరంటే.. అది మీ నాన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మీ మామ నారా చంద్రబాబు నాయుడు మాత్రమే అంటూ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకోసారి గానీ మాట్లాడితే మర్యాద దక్కదు అంటూ బ్రాహ్మణికి మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఇన్ని రోజులు నువ్వు రాజకీయం గురించి మాట్లాడా లేదు కాబట్టి నేను మాట్లాడలేదు.. ఇప్పుడు ఇలా అసత్యపు ట్విట్లు చేయడం ఎంత వరకు న్యాయం అని ఆమె ప్రశ్నించారు.

Read Also: ODI World Cup 2023: వరల్డ్ కప్లో అతను సరికాదు.. యూవీ కీలక వ్యాఖ్యలు

అయితే.. నారా బ్రహ్మణి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసింది.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.. ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం రెచ్చిపోతుంది.. అందుకే ఏపీ ప్రజలకు నా విజ్ఞప్తి! చంద్రబాబు గురించి మీకు బాగా తెలుసు.. ఆయన్ని అక్రమంగా నిర్బంధించడం తప్పు.. చంద్రబాబుకి మద్దతుగా నేడు రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి.. విజిల్ వేయండి.. ప్రయాణంలో ఉంటే హారన్ కొట్టండి.. మొత్తానికి ఏదో ఒక సౌండ్ చేసి ఈ ప్రభుత్వానికి మీ నిరసన తెలియజేయండి అంటూ సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.