స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో దోరికిపోయి జైల్లో కూర్చుంటే సిగ్గు లేకుండా చంద్రబాబు భార్య, ఆయన కోడలు గంట కొట్టండి, విజిల్స్ వేసి సీఎం జగన్ కు బుద్ది చెప్పండీ అంటున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా బ్రాహ్మణి తెలియక మాట్లాడుతోందో.. తెలిసి అబద్ధాలు ట్వీట్ చేస్తున్నారా అనేది అర్థం కావాడం లేదని మంత్రి రోజా అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రానికి గౌరవం సంపాదించే పరిస్థితి లేదు అని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. బీజేపీకి జై కొడుతూ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారు ఆయన ఆరోపించారు. బీజేపీని భుజాన మోస్తున్నారు.. వివిధ విధానాలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది.. రాష్ట్రాల హక్కులను కాల రాస్తోంది..