NTV Telugu Site icon

Minister RK Roja: 2024 ఎన్నికల్లో జగన్ గెలుపు ఎవరూ ఆపలేరు.. నాన్‌లోకల్‌ పొలిటిషన్స్‌ను ఎవరూ పట్టించుకోరు

Minister Rk Roja

Minister Rk Roja

Minister RK Roja: 2024 ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌ గెలుపును ఎవరూ ఆపలేరు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఆర్కే రోజా.. విజయవాడలోని బాపు మ్యూజియంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో లేజర్, సౌండ్ లైట్ షోను ఎంపీ కేశినేని నాని, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ప్రారంభించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. షర్మిల రాష్ట్ర రాజకీయాల్లోకి సంక్రాంతికి వచ్చే డూడూ బసవన్నల మాదిరి వచ్చారు అని సెటైర్లు వేశారు. స్ధానికత లేని పార్టీలను ప్రజలు నమ్మరు. పక్క రాష్ట్రంలో పార్టీ తీసేసి, ఇక్కడికొచ్చి మాట్లాడితారు.. జగనన్నకు ఇక్కడ అడ్రస్, గుర్తింపు, ఓటు అన్నీ ఉన్నాయి.. వైఎస్సార్‌ అభిమానులంతా సీఎం వైఎస్‌ జగన్ వెంటే ఉన్నారు.. ఉంటారు అని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

ఇక, షర్మిల లాంటివారిని రాష్ట్ర ప్రజలు ఆదరించరు.. తెలంగాణ ప్రజలు ఛీ కొడితే ఏపీలోకి షర్మిల వచ్చారు అని ఎద్దేవా చేశారు రోజా.. సామాజిక న్యాయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారు.. జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు.. గతంలో ఎప్పుడూ లేని అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తుంది.. విజయవాడ నగరంలో అంబేద్కర్ భారీ విగ్రహం, బాపూ మ్యూజియం, భవాని ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశామని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో జగన్ గెలుపు ఎవరూ ఆపలేరు.. నాన్ లోకల్ పొలిటిషియన్స్ ఇక్కడ ఉండరు.. పట్టించుకోరు.. రాజన్న బిడ్డగా ప్రజలకు రాజన్న రాజ్యం అందించడానికి జగన్ కాంప్రమైజ్ కాలేదన్నారు. ఏపీలో ఓటు అడిగే నైతిక అర్హత కాంగ్రెస్ కి లేదన్నారు.. రాష్ట్రాన్ని విడగొట్టి, వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ప్రకటించకుండా ఒక రూమ్‌లో కూర్చొని రాష్ట్రాన్ని విడగొట్టారు.. కాంగ్రెస్ తరఫున ఎవరొచ్చిన పిచ్చోళ్లవుతారు.. వాగే నోర్లకి 2024 సమాధానం చెబుతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఆర్కే రోజా..

Show comments