NTV Telugu Site icon

Minister RK Roja : రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారు

Roja

Roja

చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో జగనన్న క్రీడా సంబరాలు-2022ను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు అంటేనే మంచి నిష్కలమైన మనస్సులు గాల వారు , నా పిల్లలకు నా శాఖ ద్వారా సేవ చేయడం, ఆనందంగా భావిస్తున్నాని అన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టినా ఎలాంటి కుంటి సాకులు లేకుండా అభివృధి కి కృషి చేస్తున్న వ్యక్తి మన సీఎం జగన్ అన్న అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగిన ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఆమె మండిపడ్డారు. వారికి పేద విద్యార్థుల పట్ల మంచి ఉద్దేశం లేక పోవడం వారికి కావలసినది కార్పొరేట్ స్థాయి విద్యార్థులే. రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు చేస్తుంటే ఓర్వలేక పోతున్నారు, భజన అంటున్నారన్నారు. భజన అంటే ఎలా ఉంటుంది అంటే వైఎస్సాఆర్ కట్టిన పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు 100 కోట్లు ఖర్చు చేసి జయం జయం చంద్రన్న అంటూ వృధా చేశారు ఇది భజన అంటూ వ్యంగంగా మాట్లాడారు.
Also Read : Harish Rao: దళిత బందులో జర్నలిస్ట్ లకు అవకాశం

క్రీడలు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం మెరుగుపడుతుందని, క్రీడలు అనేవి ఆరోగ్యాన్ని ఇస్తాయని, మంచి జోష్ తీసుకువస్తాయన్నారు. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్పోర్ట్స్ లో ముగ్గురికి గ్రూప్ వన్ పోస్ట్ లు వచ్చాయని, చదువు ఎంత ముఖ్యమో, స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యమన్నారు. కోవిడ్ సమయంలో ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచన చేశామని, డిసెంబర్ 21 నాడు సీఎం జగన్ అన్న పుట్టిన రోజు నాడు విజేతలకు అవార్డులు అందిస్తారు ఆరోజు జగనన్న చేతిలో అవార్డులు తీసుకునే వాళ్ళు మీలో ఎంతమంది అని ఆమె ప్రసంగించారు. అలాగే.. క్రీడా కారులను ఉత్సాహపరుస్తూ క్రీడా శాఖ మంత్రి రోజా స్వయంగా క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ లను ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మంత్రితోపాటు చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప జాయింట్ కలెక్టర్ తదితరులు కూడా పాల్గొన్నారు.
Also Read : Jaggareddy: నాకు పీసీసీ కావాలి.. వచ్చేంత వరకు అడుగుతా