Site icon NTV Telugu

RK Roja: చంద్రబాబు పురాతన దేవాలయాలు కూల్చి.. బాత్‌రూంలు కట్టాడు!

Minister Rk Roja

Minister Rk Roja

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆర్కె రోజా మండిపడ్డారు. చంద్రబాబు పురాతన దేవాలయాలు కూల్చి బాత్‌రూంలు కట్టాడని, దేవాలయాలు అన్నింటినీ సీఎం జగన్ పునరుద్ధరిస్తున్నారన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పున్నమి ఘాట్‌ వద్ద భవానీ ఐల్యాండ్‌లో ఆదివారం కార్తీక మహోత్సవం నిర్వహించారు. కార్తీక మహోత్సవంలో భాగంగా శివపార్వతుల కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా పాల్గొన్నారు.

Also Read: Vellampalli Srinivasa Rao: టీడీపీ ఆపీస్‌కు రమ్మన్నా వస్తా.. వెలంపల్లి శ్రీనివాసరావు ఛాలెంజ్!

భవానీ ఐల్యాండ్‌లో శివపార్వతుల కళ్యాణం అనంతరం ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా మాట్లాడుతూ… ‘గతంలో చంద్రబాబు నాయుడు పురాతన దేవాలయాలు కూల్చి బాత్ రూంలు కట్టాడు. ఇప్పుడు దేవాలయాలు అన్నింటినీ సీఎం జగన్ పునరుద్ధరిస్తున్నారు. కృష్ణా నదిలో పచ్చటి ప్రకృతి ఒడిలో కార్తీక మహోత్సవం నిర్వహించాం. ఈరోజు కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణం జరిగింది. కార్తీక పౌర్ణమి నాడు శివపార్వతుల కళ్యాణం చూస్తే సకల పాపాలూ తొలగుతాయి. బిజీ లైఫ్ లో పిల్లలు, పెద్దలు కొంత సమయం తీసుకుని భవానీ ఐల్యాండ్‌లో ఈ మహోత్సవం జరుపుకోవచ్చు’ అని అన్నారు.

Exit mobile version