NTV Telugu Site icon

Minister RK Roja: పవన్ పనికిమాలినోడు.. లాగి కొట్టాలనిపిస్తోంది..

Roja Satires On Pawan

Roja Satires On Pawan

Minister RK Roja: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి ఆర్కే రోజా.. కృష్ణా జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆమె.. పవన్ కల్యాణ్‌ పనికిమాలినోడు అంటూ ఫైర్‌ అయ్యారు.. ఇక, పవన్‌ను లాగి కొట్టాలనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి పవన్ గౌరవం ఇవ్వాలని సూచించారు. పవన్ ప్రజల్లోకి వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని.. కానీ, పవన్ ను ప్రజలే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇక, సీఎం వైఎస్‌ జగన్‌కు సంస్కారం నేర్పాలని పవన్ అంటున్నారు.. ఈ మాటలు వింటుంటే సన్నీ లియోన్ వేదాలు చెప్పినట్టు ఉందని ఎద్దేవా చేశారు.

Read Also: Delhi Excise Case: సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు నోటీసులు.. మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై 28న విచారణ

జన్మభూమి కమిటీలు పెట్టి అర్హులైన వారికి కులం, మతం, పార్టీ చూసి బెనిఫిట్స్ ఇవ్వకుండా మోసం చేసినప్పుడు.. పవన్ నోరు ఎందుకు లెగలేదని ప్రశ్నించారు రోజా.. అప్పుడు నీ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? అని నిలదీశారు.. సచివాలయ వ్యవస్థ గురించి పవన్ కల్యాణ్‌కు తెలియదు.. అది చట్టం ద్వారా వచ్చింది.. పవన్ శాసనసభకు వచ్చి ఉంటే తెలిసి ఉండేది అని వ్యాఖ్యానించారు. కానీ, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే పవన్ కి వచ్చు.. ఆ మట్టి బుర్రకు పిచ్చి అరుపులు.. పిచ్చిగంతులు తప్ప ఏమీ తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. ఇక, లోకేష్ ను చూసి చంద్రబాబు బాధపడుతుంటాడు.. ఇలాంటి కొడుకును కన్నాను ఏంటి అని ? అని పేర్కొన్నారు మంత్రి ఆర్కే రోజా. మరోవైపు.. మున్సిపల్ శాఖ అధికారులపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.. మంత్రి రోజా నిర్వహించిన సమీక్షా సమావేశానికి డ్రైనేజీ విభాగం అధికారులు హాజరుకాలేదు.. దీంతో.. విచారణ చేసి సమీక్షకు రాని అధికారులపై శాఖ పరిమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు మంత్రి ఆర్కే రోజా.