NTV Telugu Site icon

RK Roja: తెలంగాణకు, ఆంధ్రాకు ఎటువంటి సంబంధం లేదు.. జగనన్నే వన్స్ మోర్‌..

Rk Roja

Rk Roja

Minister RK Roja: తూర్పు గోదావరి జిల్లా నన్నయ్య యూనివర్సిటీలో మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు, ఆంధ్రాకు ఎటువంటి సంబంధం లేదని.. 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ననే ఒన్స్ మోర్ అవుతారని మంత్రి పేర్కొన్నారు. అది చూసి పిచ్చెక్కి పిచ్చాసుపత్రిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేరుతారు.. ఇది తథ్యమని ఆమె అన్నారు.

Read Also: Telangana Govt: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు

వ్యవసాయం దండగా అన్నా పెద్దమనిషి చంద్రబాబు అని.. వ్యవసాయం చేసుకునే వ్యక్తులను ఆత్మహత్య చేసుకునేలా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. ఇవాళ రైతులకు అండగా ఉండే విధంగా ఆయన మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి రోజా. రైతులకు అండగా ఉన్నది ఆనాడు వైఎస్ఆర్.. నేడు జగన్మోహన్ రెడ్డే అంటూ మంత్రి చెప్పారు. ఈరోజు రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలతో భరోసా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి… అన్న విషయం చంద్రబాబు తెలుసుకోవాలని ఆమె హితవు పలికారు.