Site icon NTV Telugu

RK Roja: సెల్ఫీ డ్రామా.. వారికి సెల్ఫ్ గోల్..!

Roja

Roja

RK Roja: ప్రతిపక్ష నాయకులు సెల్ఫీలతో డ్రామా చేస్తున్నారు.. వాళ్ళు చేసిన సెల్ఫీ డ్రామా ప్రతిపక్ష నేతలనే సెల్ఫ్ గోల్ లో పడేస్తుందని వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రోజా.. విజయనగరంలో పర్యటించిన ఆమె.. పట్టణంలోని మహిళా పార్క్ ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వం మహిళా పక్ష పాత ప్రభుత్వం అన్నారు.. మహిళలు పిల్లలతో పాటు కాలక్షేపం చేయడానికి మహిళా పార్క్ నిర్మించడం జరిగిందన్నారు.. ప్రతిపక్ష నాయకులు సెల్ఫీ లతో డ్రామా చేస్తున్నారు.. అదే వాళ్లకు సెల్ఫ్ గోల్‌గా అభివర్ణించారు.. 17 సంవత్సరాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు.. అసలు జిల్లాకి ఏమైనా చేశాడా? అంటూ మండిపడ్డారు. జిల్లాలో ఒక్క కాలేజ్ నిర్మించలేని అశోక్ గజపతిరాజు సెల్ఫీ లు తీసుకోవడం విడ్యడూరంగా ఉందంటూ ఫైర్‌ అయ్యారు.

Read Also: Jaganannaku Chebudam: జగనన్నకు చెబుదాం… ఏ సమస్యలకు.. ఎలా పరిష్కారం అంటే..?

తను కేంద్ర మంత్రిగా చేసినా విమానాశ్రయం తెచ్చుకొలేని వ్యక్తి అశోక్ గజపతిరాజు అంటూ మండిపడ్డారు రోజా.. విమానాశ్రయానికి మీరు శంకుస్థాపన చేస్తే ఎందుకు పూర్తి చేయలేకచేయలేక పోయారు? అని ప్రశ్నించారు. ప్రజాపక్షనేత గా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది.. జగనన్నను చూసి చంద్రబాబు, అశోక్ గజపతిరాజు బుద్ధి తెచ్చుకోవాలంటూ హితవుపలికారు.. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి.. సెల్ఫీలతో కాలక్షేపం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారంటూ వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రోజా.

Exit mobile version