Site icon NTV Telugu

RK Roja: చంద్రబాబు లాంటి చీటర్ దేశంలో మరొకరు లేరు.. ధ్వజమెత్తిన ఫైర్‌బ్రాండ్‌

Minister Roja On Cbn

Minister Roja On Cbn

చంద్రబాబు లాంటి చీటర్ దేశంలో మరొకరు లేరంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. మా పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోయాయన్నారు.. పిచ్చికి పరాకాష్ట టీడీపీ ఛార్జ్‌షీట్‌ అని ఫైర్‌ అయ్యారు.. 600 హామీలు ఇచ్చి, ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు.. సీఎం సంతకాలకు విలువ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఇక, ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన వ్యక్తి బోండా ఉమ అని విమర్శించారు.. అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి, ఇప్పుడు మళ్లీ ఆ పథకం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు చెప్పాలి..? అని డిమాండ్ చేశారు. నాలుగు తరాలు గుర్తు పెట్టుకునే నాలుగేళ్ల జగన్ పాలన కొనసాగిందని ప్రశంసలు కురిపించారు.. 15 ఏళ్లు సీఎంగా కొనసాగి, తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 ఇస్తాను అంటే టీడీపీని నమ్మేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు.

Road Also: Land Rates: ఏపీలో భూముల ధరలకు రెక్కలు..! రేపటి నుంచే అమలు

ఇక, చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు మంత్రి రోజా.. చంద్రబాబును నమ్మి ఓటేసే రైతులు ఎవ్వరూ లేరన్నారు.. తమకు అనుకూలంగా లేకపోతే ఎవరినైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి కేసు విషయంలో ఇవాళ జస్టిస్ లక్ష్మణ్‌ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అన్నారు. అవినాష్ కు వ్యతిరేకంగా ఆరోపణలు తప్ప సాక్ష్యాలు లేవని హైకోర్టు చెప్పిందన్న ఆమె… చంద్రబాబుకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది.. ఇకనైనా జగన్, భారతిపై ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. ఎంపీ అవినాష్ తప్పు చేసి ఉంటే నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు చర్య తీసుకోలేదని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే సౌమ్యుడు అయిన ఎంపీ అవినాష్ ను టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న వాటిలో మూడు వైసీపీవి, కర్ణాటక కాంగ్రెస్ నుంచి రెండు, అలాగే కర్ణాటక బీజేపీ నుంచి ఒక పథకాన్ని కాపీ కొట్టారంటూ సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా.

Exit mobile version