Site icon NTV Telugu

Minister Roja: 2024లోనూ జగనన్న వన్స్ మోర్ అంటున్నారు

Roja

Roja

పల్నాడు జిల్లాలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఊపుమీద సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు,, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. తమ ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని ఊళ్లలో మేళ­తాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మ­రథం పడుతున్నారు.‘ఎమ్మెల్యే వద్దకు ప్రజలు వెళ్లడం సాధారణంగా జరిగేది. కానీ అందుకు విరుద్దంగా ప్రజల వద్దకే మంత్రులు, ఎమ్మెల్యేలు రావడం అంటే అది కేవలం ఒక్క జగనన్న వల్లే సాధ్యమైంది’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నేతలే చెబుతున్నారు.

Read Also: Jagananna Maa Bhavishyathu: 175 నియోజకవర్గాల్లో ఉద్యమంలా జగనన్నే మా భవిష్యత్తు

జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా కామెంట్లు చేశారు. విపక్షాలపై ఆమె మండిపడ్డారు. 2024 లో జగనన్నను వన్స్ మోర్ అంటూ ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన 16 మంది ముఖ్యమంత్రు ల కన్నా మిన్నగా పాలిస్తున్నాడు జగనన్న…అలాంటి జగన్ పై నీతిమాలిన రాజకీయాలు చేయాలని చూస్తే టిడిపి ,జనసేన లను తరిమి తరిమి కొడతాం…వైసీపీ నాయకులతో మంచికి మంచి ఉంటుంది, చెడుకు చెడు ఉంటుందన్నారు. గతంలో మహిళా పార్లమెంటుకు పిలిచి చంద్రబాబునాయుడు నన్ను అవమానించాడు… ఇదే మాచర్లలో పోలీసుల పేరు అడ్డు పెట్టుకుని వేధించాడు… అలాంటి నన్ను ఇదే మాచర్ల గడ్డపై పోలీస్ సెక్యూరిటీతో మంత్రిని చేశాడు సీఎం జగన్..అధికారాన్ని వదిలిపెట్టి జగనన్న వెంట నడిచిన సైనికుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాలాంటి నాయకులకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఇన్స్పిరేషన్ అన్నారు మంత్రి రోజా.

Read Also: Uniform Bites By Rats: హవ్వ.. యూనిఫాం ఎలుకలు కొరికేశాయట..

Exit mobile version