NTV Telugu Site icon

Minister Ramprasad Reddy: కడప-హైదరాబాద్‌ ఇండిగో కనెక్టింగ్ విమాన సర్వీసును ప్రారంభించిన మంత్రి

Kadapa

Kadapa

Minister Ramprasad Reddy: కడప ఎయిర్‌పోర్టులో కడప – హైదరాబాద్ ఇండిగో కనెక్టింగ్ విమాన సర్వీసును రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, చైతన్య రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఏడాదిగా కడప-హైదారాబాద్ విమాన సర్వీసులు లేవని.. ఎన్నో సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ సర్వీసులు పునరుద్ధరించామన్నారు. హైదరాబాద్ కనెక్టివిటీ ద్వారా దేశంలో అన్ని చోట్లకు వెళ్లే సదుపాయం కలుగుతోందన్నారు.

Read Also: Vijaysai Reddy: చంద్రబాబు ఆనందం కోసం షర్మిల మాట్లాడుతున్నారు

ఈ సందర్భంగా కేంద్ర విమాన శాఖ మంత్రికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కడప నుంచి దూర ప్రాంతాలకు కూడా త్వరలో కనెక్టివిటీ పెంచుతామన్నారు. అలానే రైల్వే శాఖలో అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 120 రోజులు దాటిందని.. విద్యుత్ చార్జీల పెంపుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే విద్యుత్ చార్జీల పెంపు.. యూనిట్ 5 నుంచి 7 రూపాయలకు కొనడం వల్లే ఈ భారమని అన్నారు. అనుభవజ్ఞుడైన చంద్ర బాబుకు ప్రజలకు ఏం చేయాలో తెలుసన్నారు. ప్రజలపై కూటమి ప్రభుత్వం ఏ భారం వేయదన్నారు.