NTV Telugu Site icon

Minister Ramprasad Reddy: అమరావతి నిర్మాణానికి మంత్రి విరాళం

Chandrababu

Chandrababu

Minister Ramprasad Reddy: ఏపీలో అమరావతి నిర్మాణం పనులు వేగంగా జరగుతున్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రాజధాని నిర్మాణానికి విరాళాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. విరాళం ఇచ్చేదుందుకు మంత్రులు కూడా ముందుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. సంబంధిత ₹3,01,116/- రూపాయల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సచివాలయంలో అందజేశారు. విరాళం అందించిన మంత్రిని సీఎం చంద్రబాబు అభినందించారు.

Read Also: Projects Gates Closed: శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాల గేట్లు మూసివేత