Site icon NTV Telugu

Minister Ramanaidu: ఆ అంశంలో తెలంగాణ సహకరించాలి.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!

Ramanaidu

Ramanaidu

పోలవరం, బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష జరిగిందని.. తుపాన్ బారి నుంచి పంటలు కాపాడుకునే విధంగా చర్యలు తీస్కుంటున్నామని మంత్రి రామానాయుడు అన్నారు. పంట కాలాన్ని ముందుకు తీసుకు వచ్చే చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పినట్లు తెలిపారు. నీటి లభ్యత బులెటిన్ విడుదల చేస్తామని.. పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తామని స్పష్టం చేశారు. భూ గర్భ జలాలు పెంచు కోవడం పై దృష్టి పెడుతున్నామన్నారు. రిజర్వాయర్ లో నీటి నిల్వలు.. 516 టీఎంసీ వరకు ఉన్నాయని.. ఖరీఫ్ ప్రారంభానికి ముందు కూడా నీటి నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. రాయలసీమ ప్రాంతంలో కూడా నీటి నిల్వలు ఉన్నాయన్నారు. పోలవరం బనకచర్ల అటవీ పర్యావరణ అనుమతిపై దృష్టి పెడుతున్నామని.. భూ సేకరణపై కూడా కసరత్తు జరుగుతోందన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ కు బడ్జెట్ లోటు లేకుండా చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర కు గోదావరి జలాలను తీసుకెళ్లే పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రొజెక్ట్ కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

READ MORE: Trump vs Musk: ఎలాన్ మస్క్ అక్రమ గ్రహాంతరవాసి.. అమెరికా వదిలి వెళ్లిపోవాలి..

పోలవరం పనుల పై సీఎం సంతృప్తితో ఉన్నారని మంత్రి రామానాయుడు అన్నారు. “బుడమేరు కు గండ్లు పడకుండా సీసీ వాల్ నిర్మాణం జరుగుతోంది. విజయవాడకు బుడమేరు వల్ల ఇబ్బంది లేకుండా ప్లాన్ జరుగుతోంది. బుడమేరు ఓల్డ్ ఛానెల్ పనులు.. అదే విధంగా ఎనికపాడు నుంచి కెపాసిటీ పెంచే చర్యలు జరగాలి.. రాజకీయ పరమైన కారణాలతో బనకచర్ల పై తెలంగాణ నేతలు మాట్లాడచ్చు. దేశంలో కరువు కాటకాలకు కారణం నదుల అనుసంధానం లేకపోవడమే అని నిపుణులు చెప్తున్నారు. గోదావరి నుంచి వృథాగా నీరు సముద్రం లోకి పోతోంది. వర్షాలు ప్రారంభం కాకుండానే వృథాగా నీరు పోతోంది. 3000 టీఎంసీలు వృథాగా పోతోంది. కేవలం 200 టీఎంసీలు మాత్రమే ఉపయోగిస్తున్నాం. తెలంగాణ సహకరించాలి. అర్థం చేసుకోవాలి. భవిష్యత్ లో నదుల అనుసంధానమే మార్గం..” అని మంత్రి రామానాయుడు వెల్లడించారు.

READ MORE: Covid-19 Variant: వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్‌ వేరియంట్‌.. లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?

Exit mobile version