NTV Telugu Site icon

Puvvada Ajay Kumar : దాడులను సహించేది లేదు.. శ్రీనివాస రావుపై దాడి, హత్య చేసిన ఎవరినీ వదిలిపెట్టం

Puvvada

Puvvada

నిన్న గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాస రావు అంత్యక్రియల్లో మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు పువ్వాడ, ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దాడులను సహించేది లేదన్నారు. శ్రీనివాస రావు పై దాడి చేసి, దారుణంగా హత్య చేసిన ఎవరిని వదిలిపెట్టమని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుందని వారు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఈ విషయంపై వెంటనే స్పందించారని, అధికార లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ ను ఆదేశించారన్నారు.
Also Read : Dharmana Prasada Rao: విశాఖ రాజధాని అయితే చంద్రబాబు వచ్చిన నష్టం ఏంటి..? బిజినెస్‌ చేస్తూ హైదరాబాద్‌లో ఉంటాడు..!

ఇర్లపుడి వెళ్ళి ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస రావు అంతిమ యాత్రలో పాల్గొనాలని మమ్మల్ని ఆదేశించారని, సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు ప్రభుత్వము రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్ కల్పిస్తూ జీవో జారీ చేసిందన్నారు. ఇక్కడి గిరిజనులతో సమస్య లేదని, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అక్రమంగా వలస వచ్చిన గుత్తి కొయలు అడవులను విచక్షణ రహితంగా నరికి వేస్తున్నారని వారు ఆరోపించారు. అడవులను నరికినట్లు మా అటవీ అధికారులను కూడా నర్కుతం, దాడులు చేస్తాం అంటే ఊరుకునేది లేదని, ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని వారు మరోసారి ఉద్ఘాటించారు.