Site icon NTV Telugu

Ponnam Prabhakar: అధిక ప్రాధాన్యత విద్యకే.. కార్పొరేట్ స్కూల్‌కి మించి పోటీ పడాలి!

Ponnama Prabhakar

Ponnama Prabhakar

తెలంగాణాలో అన్ని రంగాల కంటే అత్యధిక ప్రాధాన్యత విద్యకే ఇస్తాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్పొరేట్ స్కూల్‌కి మించి మనం పోటీపడాలని విద్యార్థులతో ఆయన అన్నారు. ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమం ద్వారా అమీర్‌పెట్ డీకే రోడ్డులోని గర్ల్ ప్రైమరీ స్కూల్ & హై స్కూల్‌లలో రెనోవేశన్ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, డీఈవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ‘మారుతున్న కాలానికి అనుగుణంగా, సాంకేతికతతో మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. అన్ని రంగాల కంటే అత్యధిక ప్రాధాన్యత విద్యకి ఇస్తాం. నేను విద్యార్థి నాయకుని నుండి ఈ స్థాయికి వచ్చా. ఇక్కడ 900 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరగాలి. కార్పొరేట్ స్కూల్‌కి మించి పోటీ పడాలి. గ్రామీణ ప్రాంత వాతావరణంకి అనుగుణంగా ఇక్కడ చెట్లు ఉన్నాయి. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఈసారి మంచి రిజల్ట్ రావాలి’ అని అన్నారు.

Also Read: Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసు.. పోలీసుల విచారణకు హాజరైన నటి! పరారీలో నటుడు

‘గతానికి, ఇప్పటికీ ఏదైనా తేడా ఉందా అని ఆలోచించాలి. మీ సలహాలు, సూచనలు తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు కష్టపడి చదవాలి. అపుడే ఉన్నత స్థాయికి చేరుకోగలరు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలి. వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలి. మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరి మెరిట్ రిజల్ట్ రావాలి. హైదరాబాద్ నగరంలోనే నంబర్ 1 స్కూల్ కావాలి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

 

Exit mobile version