వచ్చే 17న జరగబోయే గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పై అన్ని శాఖలతో సమన్వయం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వారం రోజుల్లో ప్రజా ప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి వారితో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని తెలంగాణ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ( ICCC)లో 2024 గణేష్ పండుగను పురస్కరించుకొని అన్ని విభాగాలతో ప్రభుత్వం ప్రాథమిక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈరోజు ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ అధికారులతో నిర్వహించామని వెల్లడించారు. గతంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఈ ఏడాది జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
READ MORE: Prabhas Fauji: ప్రభాస్ కోసం కొత్త భామ.. ఎవరీ ఇమాన్వి.. ఇంత క్యూట్ గా ఉందేంటి?
దేశంలో ముంబై తరువాత హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని మంత్రి అన్నారు. బోనాలు ఎలా అయితే ఘనంగా జరుగుకున్నామో అలాగే గణేష్ నిమజ్జనం జరిగేలా చూస్తామని తెలిపారు. హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచేలా చూస్తామని అన్నారు. ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి, ఘనంగా నిర్వయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. హుసేన్ సాగర్ నిమజ్జనం అనే అంశం కోర్ట్ ఆదేశాలు ప్రకారం ముందుకు పోతామని చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
