Ration Cards: పాత రేషన్ కార్డులు తొలగించడం లేదు.. తప్పుడు ప్రచారంను నమ్మొద్దు: మంత్రి పొన్నం
- ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు
- జనవరి 26 నుండి కొత్త కార్డులు
- ఇందుర్తి మండలం ఏర్పడుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని స్పష్టం చేశారు. అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి జనవరి 26 నుండి కొత్త కార్డులు ప్రభుత్వం ఇస్తుందని, ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే.. సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చని మంత్రి పొన్నం చెప్పారు.
కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు పాత 90 లక్షల రేషన్ కార్డులు చర్చ కాదు. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా, కొత్తగా పెళ్లి అయిన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి శుభవార్త చెబుతున్నా. అర్హత ఉన్న వారికి జనవరి 26 నుండి రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం ఇస్తుంది. ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయి. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చు’ అని తెలిపారు.
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
Also Read: Padi kaushik Reddy: పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు.. అన్నింటికీ సమాధానం చెప్పా!
‘పాత రేషన్ కార్డులు తొలగించడం లేదు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే నమ్మవద్దు. కుల సర్వే ఆధారంగా అప్లికేషన్ల సమాచారంతో కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇందుర్తిలో 71 కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు వస్తున్నాయి. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా 12 వేలు ఇస్తున్నాం. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నాం. భూమి లేని రైతు కూలీలకు 12 వేలు ఇస్తున్నాం. ఇందుర్తి మండల ప్రతిపాదనలు పంపాం. రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం ఏర్పడుతుంది’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!